గంగోలులో బంగారం చోరీ

Wed,June 12, 2019 12:01 AM

దుమ్ముగూడెం, జూన్ 11 : మండల పరిధిలోని గంగోలు గ్రామంలో ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండగలు చోరీకి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి...గంగోలు గ్రామానికి చెందిన దన్నిన కృష్ణార్జున్‌రావు అనే వ్యక్తి కుటుంబసభ్యులతో గత నాలుగు రోజుల క్రితం ఊరు వెళ్లారు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందర చేసి, బీరువా తాళం పగలకొట్టి అందులో ఉన్న నాలుగు తులాల బంగారం, మూడు ఉంగరాలు, ఒక బంగారపు లాకెట్ తదితర వస్తువులను దొంగలించినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఇంటి యజమానికి సమాచారం అందించారు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న యజమాని కుటుంబికులు పరిశీలించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles