ఖమ్మం జిల్లాలోనూ ఆమె..!

Tue,June 11, 2019 01:27 AM

-20 ఎంపీపీలల్లో 12 ఎంపీపీ పదవులు మహిళలకే
-20 జడ్పీటీసీల్లో 10 మంది వారే..
-20 వైస్ ఎంపీపీలకు 6 పదవులు కేటాయింపు
-జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సైతం మహిళే
-టీఆర్‌ఎస్ పాలనలో మహిళలకు పెద్ద పీట
-రాజకీయ పదవుల్లో అవకాశాలు కల్పించిన కేసీఆర్
మామిళ్లగూడెం, జూన్ 10 : ఆకాశంలో సగభాగం స్త్రీ... అవనిలో అర్థభాగం ఆమెనే... అలాంటి విశిష్టత కలిగిన మాతృమూర్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలో పెద్ద పీట వేసింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల్లో నారీమణులకు రాజకీయ పదువుల్లో సగంభాగం అవకాశాలను కల్పించింది. జిల్లాలో ఎన్నికలు జరిగిన 289 ఎంపీటీసీ స్థానాల్లో 145 ఎంపీటీసీ స్థానాలు మహిళలకే రిజర్వు చేశారు. ఆ స్థానాలలో గెలుపొందిన పలువురు మహిళలు మండల ప్రజాపరిషత్ అధ్యక్ష పీఠాలపై ఆశీనులయ్యారు. మండల పరిషత్ చైర్మన్ హోదాలో మండలంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను నిరంతరం పర్యవేక్షించి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా రాణించనున్నారు. అదే విధంగా 20 జడ్పీటీసీ స్థానాల్లో 10 జడ్పీటీసీ స్థానాలు మహిళలు గెలుచుకున్నారు. అలాగే ఎలాంటి రిజర్వేషన్ లేని మండల ప్రజాపరిషత్ వైస్ చైర్మన్ పదవులలోనూ మహిళలకు ఆరు పదవులు దక్కడం విశేషం. జిల్లాలో అత్యంత కీలకమైన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి కూడా మహిళకే కేటాయించి టీఆర్‌ఎస్ పార్టీ మహిళా పక్షపాతిగా నిలిచింది.

20 ఎంపీపీలల్లో 12 ఎంపీపీ పదవులు మహిళలకే...
జిల్లాలోని 20 మండలాల్లో 12 ఎంపీపీ పదవుల్లో మహిళలు అధ్యక్ష పీఠాలను సొంతం చేసుకున్నారు. రిజర్వేషన్‌ల నిబంధనల ప్రకారం 10 ఎంపీపీ పదవులే దక్కల్సి ఉన్నప్పటికి మహిళా ప్రాధాన్యత ఆయా మండలాల్లో పెరగడంతో మరో రెండు జనరల్ స్థానాలోను మహిళా మనులు ఎంపీపీలుగా పదవులు దక్కించుకున్నారు.

ఎంపీపీలుగా ఎన్నికైన మహిళలు వీరే...
బోనకల్- కే సౌభాగ్యం, ఏన్కూరు - ఆరెం వరలక్ష్మీ (జనరల్‌స్థానం), కామేపల్లి- బానోత్ సునీత, ఖమ్మం రూరల్ - బెల్లం ఉమా, మధిర - మెండెం లలిత, నేలకొండపల్లి- వజ్జా రమ్యా, పెనుబల్లి -లక్కినేని అలేఖ్య, రఘునాథపాలెం- బానోత్ గౌరీ, సత్తుపల్లి- దొడ్డా హైమావతి, సింగరేణి- మాలోత్ శకుంతల, వైరా -వేల్పుల పావని, ఎర్రుపాలెం- దేవరకొండ శిరీష (జనరల్), మహిళలు ఎంపీపీలుగా పదవులను స్వీకరించారు.

మహిళా సాధికారత టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం
గతంలో ఎన్నడులేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహిళలకు సముచితస్థానం ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. మహిళా సాధికారత టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుంది. 60శాతం మహిళలే ప్రజాప్రతినిధులుగా నేడు పీఠాలను ఆధిరోహించడం గొప్ప విషయం. మహిళలు అన్ని రంగాల్లో రాణించి సత్తా ఉందన్నారు. అవకాశాలు వస్తే తప్పకుండా తమను తాము నిరూపించుకుంటాం. మహిళలు ఇంటికి పరిమతం కాకుండా అన్ని రంగాల్లో రాణించేందుకు నేడు ప్రభుత్వం కల్పిస్తున్న చొరవ చాల గొప్పది. అందరి సహకారంతో ప్రజలకు తగు న్యాయం చేస్తాం.
- బెల్లం ఉమా, ఖమం రూరల్ ఎంపీపీ


వైస్ ఎంపీపీలు వీరే...
కల్లూరు- బీ భవాని, కామేపల్లి- ఆజ్మీరా విజయలక్ష్మీ, పెనుబల్లి- నరుకుళ్ల కస్తూరి, తల్లాడ- శీలం శివపార్వతి, వేంసూరు- దొడ్డా శ్రీలక్ష్మీ, వైరా- బాణాల లక్ష్మీనర్సమ్మలు ఎన్నికయ్యారు.

జడ్పీటీసీలు వీరే...
- జిల్లాలోని 20 మండలాల్లో జడ్పీటీసీ ఎన్నికలు జరగగా 10 జడ్పీటీసీ స్థానాల్లో మహిళలు విజయం సాధించారు. గెలిచిన వారిలో నుంచే నేలకొండపల్లి జడ్పీటీసీ మరికంటి ధనలక్ష్మీకి జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్‌పర్సన్ పదవి దక్కింది. రఘునాథపాలెం- మాలోత్ ప్రియాంక, కూసుమంచి- ఇంటూరి బేబి, నేలకొండపల్లి- మరికంటి ధనలక్ష్మీ, ముదిగొండ- పసుపులేటి దుర్గ, కొణిజర్ల- పోట్ల కవిత, ఏన్కూరు- బానోత్ బుజ్జి, వేంసూరు- ఎం. సుమలత, తల్లాడ- డీ ప్రమీల, వైరా- నంబూరి కనకదుర్గ, ఎర్రుపాలెం- శీలం కవితలు జిల్లా పరిషత్‌లో జడ్పీటీసీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా..
రాజకీయాల్లో మహిళలకు అవకావం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన 50శాతం రిజర్వేషన్ ప్రక్రియ సంతోషంగా ఉంది. చిన్ననాటి నుంచి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో ఉన్న నాకు 50శాతం రిజర్వేషన్‌తో జడ్పీటీసీగా పని చేసే అవకాశం దక్కింది. రఘునాథపాలెం జడ్పీటీసీగా మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా.
- మాళోతు ప్రియాంక, రఘునాథపాలెం జడ్పీటీసీ


50శాతం రిజర్వేషన్‌తోనే అవకాశం..
మహిళలకు కల్పించిన 50శాతం రిజర్వేషన్‌తోనే నాకు పాపటపల్లి స్థానం నుంచి ఎంపీటీసీగా పోటీ చేసే అవకాశం లభించింది. అందులోనూ మండల ప్రాతిపధికన మహిళలకు కేటాయించిన 50శాతం రిజర్వేషన్‌లో రఘునాథపాలెం మండలం ఎంపీపీ ఎస్టీ మహిళగా రిజర్వేషన్ వచ్చింది. ఇందులో భాగంగా నాకు అవకాశం దక్కింది. వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం దుర్వినియోగం చేయకుండా మండల సమగ్రాభివృద్దికి పాటుపడుతా.
- భుక్యా గౌరి, రఘునాథపాలెం ఎంపీపీ

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles