నష్టనివారణకు విద్యుత్ శాఖ చర్యలు

Tue,June 11, 2019 01:26 AM

లక్ష్మీదేవిపల్లి: 400 కేవీ విద్యుత్‌లైన్ ఒక్కసారి ట్రిప్ అయితే ప్రభుత్వానికి రూ.3 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు విద్యుత్ లైన్ల వెంట ఉన్న చెట్లను తొలగించేందుకు సోమవారం ట్రాన్స్‌కో, అటవీశాఖాధికారులు పలుచోట్ల అడ్డుగా ఉన్న చెట్లను పరిశీలించారు. జూలూరుపాడు నుంచి మణుగూరు భద్రాద్రి పవర్ ప్లాంట్, కేటీపీఎస్ పరిధిలోని 400 కేవీ విద్యుత్ లైన్ల ద్వారా విద్యుత్ సరఫరా అవుతున్న నేపథ్యంలో అప్రమత్తమయ్యామని చెప్పారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో, గాలిదుమారం ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని, విద్యుత్ లైన్ల కింద ఉన్న భారీ వృక్షాలు, జామాయిల్ తోటలు, ఎత్తైన చెట్లు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రేగళ్ల, గట్టుమళ్ల, అనిశెట్టిపల్లి తదితర ప్రాంతాల్లో అడ్డుగా ఉన్న చెట్లు తొలగిస్తామన్నారు. పరిశీలనలో ట్రాన్స్‌కో ఏడీఈ(వరంగల్) సతీష్‌రాజు, జిల్లా అటవీశాఖ అధికారి శివాల రాంబాబు, ఐఎఫ్‌ఎస్ ట్రైనీ అధికారి భోగా నిఖిత, ఎఫ్‌బీవో సుతాన్, రేంజర్ శ్రీనివాసరెడ్డి, రమణ, సిబ్బంది క్రాంతి పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles