రేపు కొత్తగూడెంలో జాబ్ మేళా

Tue,June 11, 2019 01:26 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈ నెల 12న కొత్తగూడెంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి, ఆపైన విద్యార్హతగల నిరుద్యోగులంతా దీనిని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామీణాభివృద్ధ్ది సంస్థ, ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ సంయుక్తాధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 12న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సుమారు 20కి కంపెనీలు పాలొంటాయని తెలిపారు. దాదాపుగా 2000 పోస్టును భర్తీ చేస్తాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు బయోడేటా, సర్టిఫికెట్స్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో రావాలని నామా తెలిపారు.

కొత్తగూడెం అర్బన్: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ(డీఆర్‌డీఏ), ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం) ఆధ్వర్యంలో ఈ నెల 12న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఓ పి.జగత్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో 12న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ సదవకాశాన్ని నిరుద్యోగులంతా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు 7995806182, 7799470817 సెల్ నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.

74
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles