కొత్తూరులో నగలు, నగదు చోరీ

Tue,June 11, 2019 01:25 AM

అశ్వారావుపేట రూరల్: మండలంలోని కొత్తూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు& అశ్వారావుపేట-వేలేరుపాడు మండలాల సరిహద్దులోని కొత్తూరు గ్రామంలోని జల్లిపల్లి శ్రీనివాసరావు దంపతులు తమ ఇంటి ఆవరణలో పడుకున్నారు. వారి కుమారుడు టీవీ చూసి రాత్రి 11 గంటల తరువాత నిద్రపోయాడు. ఇంటి కిటికీలకు ఇనుప మెష్ లేదు. ఆ కిటిలో నుంచి దొంగలు లోనికి ప్రవేశించారు. బీరువా పగలగొట్టారు. అందులోగల 10 కాసుల బంగారం, రూ.80వేల నగదు దొంగిలించారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవటంతో, ఆరుబయట పడుకున్న శ్రీనివాసరావు దంపతులు లోపలికి వెళ్లారు. బీరువా పగలగొట్టి ఉండడాన్ని, అందులోని వస్తువులన్నీ కింద చిదరవందరగా పడుండడాన్ని గమనించారు. వెంటనే గ్రామంలోని తమ బంధువులకు సమాచారమిచ్చారు. బాధితుల ఫిర్యాదుతో ఆ ఇంటిని సీఐ అబ్బయ్య పరిశీలించారు. ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. తమ కుమారుడి ఇంజనీరింగ్ కాలేజి ఫీజు కట్టేందుకు రూ.80వేలను ఇంటిలో ఉంచినట్టు ఆ దంపతులు తెలిపారు. నగల విలువ మూడులక్షల రూపాయలకు పైగా ఉంటుందని చెప్పారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles