యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించాలి

Tue,June 11, 2019 01:25 AM

మణుగూరు, నమస్తే తెలంగాణ: సింగరేణి మణుగూరు ఏరియాలో ఈ నెల 21న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఏరియా జీఎం జక్కం రమేష్ కోరారు. జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏరియా అధికారులతో సోమవారం ప్రత్యే సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21న పీవీ కాలనీ భద్రాద్రి స్టేడియంలో ఉదయం 10 గంటలకు అంతర్జాతీయ యోగా వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ నెల 20న సాయంత్రం 5.00 గంటలకు యోగా రన్ నిర్వహించాలన్నారు. ఈ రన్‌లో మహిళలు, పిల్లలు, సింగరేణి ఉద్యోగులు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కోరారు. ఈ నెల 17 నుంచి అన్ని గనులు, డిపార్టెమెంట్ల వద్ద ప్రతి రోజు ఉదయం యోగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందులో ఉద్యోగులను భాగస్వాములను చేయాలన్నారు. ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు అన్ని గనులు, డిపార్టుమెంట్ల వద్ద స్వచ్చత పక్షోత్సవాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఏఎస్‌వో వెంకటరమణ, పీకేఓసీ, మణుగూరు ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్లు లక్ష్మిపతిగౌడ్, లలిత్‌కుమార్, డీజీఎంలు రేవు సీతారాం, బొజ్జా రవి, వెంకటేశ్వర్లు, వెంకటరమణ, నర్సిరెడ్డి, డాక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles