భూపరిహారం అవకతవకలపై ఆర్డీఓ విచారణ

Tue,June 11, 2019 01:25 AM

సత్తుపల్లి టౌన్: మండలంలోని కిష్టారం పంచాయతీ పరిధిలోగల కొమ్మెపల్లిలో సింగరేణి భూనిర్వాసితుల పరిహారంలో పలు అవకతవకలు జరిగాయంటూ ఆ గ్రామస్తుడు యాదాల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుకు కలెక్టర్ కర్ణన్ స్పందించారు. ఆయన ఆదేశంతో ఆర్డీఓ శివాజీ, సోమవారం విచారణ చేపట్టారు. నూతన భూసేకరణ చట్టం ప్రకారంగా అర్హులందరికీ న్యాయం జరగనందునే ఫిర్యాదు చేసినట్లు విచారణాధికారితో శ్రీనివాస్ చెప్పారు. విలేకరులతో శ్రీనివాస్ మాట్లాడుతూ& ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో గ్రామంలోని నిజమైన 17మంది అర్హులకు ప్యాకేజీ వర్తించకుండా గ్రామంలో లేని, ఎక్కడో ఉన్న వ్యక్తులు ఫైరవీలు చేయించుకుని పరిహారం పొందారని చెప్పారు. వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలుగా చూపించి, భూమిలో లేని చెట్లను సైతం ఉన్నట్లు చూపించి కోట్లలో డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడితే కోట్ల కుంభకోణం వెలుగులోకి వస్తుందన్నారు. దీనిపై ఆర్డీఓ శివాజీని వివరణ కోరగా... విచారణ జరపుతున్నాం. పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తాం. పరిహారం పొందిన, పొందని వారందరినీ విచారణకు పిలిచాం అని చెప్పారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles