ఉపాధి కూలీకి పాముకాటు

Tue,June 11, 2019 01:25 AM

కూసుమంచి: మండలంలోని జక్కేపల్లిలో ఉపాధి పనులకు వెళ్లిన మహిళను పాము కాటేసింది. జక్కేపల్లిలో కొన్ని రోజులుగా ఉపాధి పథకం కింద పంట కాలువల తవ్వకాలు, మరమ్మతు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన కొత్తా మల్లీశ్వరి(30), సోమవారం ఉదయం తోటి కూలీలతో కలిసి ఉపాధి పనికి వెళ్లింది. పనులు చేస్తుండగా ఆమెను పాము కాటువేసింది. తోటి కూలీల సహకారంతో ఆమెను ఖమ్మం ఆసుపత్రికి కుటుంబీకులు తరలించారు. ప్రాణాపాయం తప్పింది.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles