డ్రంకెన్ డ్రైవర్లకు జైలు

Tue,June 11, 2019 01:25 AM

కొత్తగూడెం లీగల్: మద్యం మత్తులో వాహనం నడుపుతున్న నలుగురురికి జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, మొదటి అదనపు జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ (ఎఫ్‌ఏసీ) జీవీ మహేష్‌నాథ్ సోమవారం తీర్పు చెప్పారు.కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్సై ఇ.రతీష్, తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. 4 ఇైంక్లెన్‌కు చెందిన భూక్యా దిసిన్, కొత్తగూడెం శ్రీనగర్‌కు చెందిన జె.కోటేశ్వరరావు, రేగళ్ళకు చెందిన గుగులోతు భాను, పాత కొత్తగూడేనికి చెందిన గంగారపు ప్రవీణ్ నడుపుతున్న వాహనాలను ఆపారు. వారిని బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించారు. వారు మోతాదుకు మించి మద్యం తాగినట్టుగా తేలింది. వారిని అదుపులోకి తీసుకుని కోర్టుకు అప్పగించారు. భూక్యా దివిస్‌కు రెండు రోజులు, జె.కోటేశ్వరరావుకు మూడు రోజులు, గుగులోతు భానుకు ఒక రోజు, గంగారపు ప్రవీణ్‌కు మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌కు కోర్టు హెచ్‌సీ గజ్జల శ్రీనివాసరావు, లైజన్ ఆఫీసర్ ఎన్.శ్రీనివాసరావు సహకరించారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles