టీఆర్‌ఎస్ రెబల్స్‌పై వేటు ..

Sun,June 9, 2019 05:51 AM

ముదిగొండ, జూన్ 8 : గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటమే కాకుండా క్రమశిక్షణను ఉల్లంఘించిన ఇద్దరు ఎంపీటీసీలు, ఒక సర్పంచ్‌పై అదిష్ఠానం ఆదేశాల మేరకు వేటు పడింది. పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులపై పోటీ చేయడంతో పాటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కమలాపురం ఎంపీటీసీ దేవరపల్లి ఆదినారాయణరెడ్డి, మాదాపురం ఎంపీటీసీ ఎరబోలు పిచ్చమ్మ, సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మీగడ శ్రీనివాస్ యాదవ్, ముదిగొండ ఎంపీపీ సామినేని హరిప్రసాద్‌లు తెలిపారు. మధిర నియోజకవర్గ ఇన్‌చార్జ్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ ఆదేశాల మేరకు శనివారం నిర్వహించిన మండల కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటమే కాకుండా ఎంపీపీ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రలోభాలకు తలొగ్గి టీఆర్‌ఎస్ పార్టీని నష్టపరిచే విధంగా ప్రయత్నించారని వారు ప్రకటనలో తెలిపారు. అదేవిదంగా కమలాపురంలో టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేయటమే కాకుండా పార్టీ కార్యకర్తలపై దాడులు చేసిన మాజీ ఎంపీటీసీ వాకా రామతారకం, వాకా వెంకటరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు అవసాని వెంకన్న, రైతు సమన్వయ సమితి కన్వీనర్ దేవరపల్లి రమణా రెడ్డి, గోకినేపల్లిలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న గ్రామ కార్యదర్శి కొమ్మినేని సుధాకర్, మాధాపురానికి చెందిన రైతుసమన్వయ సమితి కన్వీనర్ మోర్తాల హనిమిరెడ్డి, పెద్దమండవకు చెందిన కోడె బాబు, చిరుమర్రికి చెందిన కొడాలి క్రిష్ణారావును టీఆర్‌ఎస్ పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ పోట్ల వెంకట ప్రసాద్, మండల సీనియర్ నాయకులు బత్తుల వీరారెడ్డి, మందరపు వెంకన్న, అనంతరెడ్డి, బంక మల్లయ్య, బ్రహ్మారెడ్డి, పచ్చ సీతరామయ్య, కోటి అనంతరాములు, నాగార్జున రెడ్డి, షేక్ మౌళానా, వెంకటనాగ ప్రసాద్ పాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles