నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనం..

Sun,June 9, 2019 05:51 AM

మయూరిసెంటర్, జూన్ 8 : ఒకరు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కంకణ బద్దులై గత సుమారు 40 సంవత్సరాల నుంచి మొక్కలు నాటి వృక్ష సంపదను పెంపొందించడంలో దిట్ట. ఈ విభాగంలో ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా పద్మశ్రీ పురస్కారాన్ని అందింప చేసి ఖమ్మం జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేసింది. ఆయనే వనజీవి రామయ్య. అనాథ అభాగ్యుల పాలిట నేనున్నాని, అర్ధరాత్రి, అపరాత్రి అయినా కూడా ఫోన్ మోగితే వెనువెంటనే అభాగ్యుల వద్దకు చేరుకుని ఆ ప్రాంత ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్న వాతావరణాన్ని సాధారణ స్థాయికి తీసుకువచ్చి ఆ వ్యక్తికి సపర్యలు చేసి తన ఆశ్రమానికి తీసుకువెళ్లి సుమారు 250ల మంది అనాథ అభాగ్యులు, మానసిక రోగులకు పెద్ద దిక్కు అయ్యారు అన్నం శ్రీనివాసరావు. పర్యవారణ పరిరక్షణలో భాగంగా ఖమ్మం జిల్లాకు చెందిన కడివెండి వేణుగోపాల్ పలు సామాజికి కార్యక్రమాలలో తన సేవలను అందిస్తూ ప్లాస్టిక్ నివారణ కోసం ఉద్యమరూపంలో నిర్వహించిన కార్యక్రమాలు పలు అవగాహన అంశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తించి ఈ త్రీమూర్తులకు శనివారం శాలువాలు, జ్ఞాపికలతో విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఘనంగా సత్కరించి తెలంగాణ రాష్ట్ర సేవా నిరతికి వందనం సమర్పించింది. ఈ త్రీమూర్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిసెర్చ్ అండ్ ఎక్స్‌టెన్షన్ బైయోడైవర్సీటీ బోర్డు డైరెక్టర్ డాక్టర్ కే తులసిరావు, అడిషనల్ డైరెక్టర్ ఎస్‌కే రెహ్మాన్‌ల చేతుల మీదుగా పర్యావరణ మిత్ర జాతీయ అవార్డును అందుకున్నారు. వీరి పురస్కారాలకు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles