నేలకొండపల్లికి దక్కిన జడ్పీ వైస్ చైర్‌పర్సన్ పీఠం

Sun,June 9, 2019 05:51 AM

నేలకొండపల్లి, జూన్ 8: జిల్లా పరిషత్‌లో ఈసారి నేలకొండపల్లికి వైస్ చైర్‌పర్సన్ పీఠం దక్కింది. నేలకొండపల్లి జడ్పీటీసీగా విజయం సాధించిన మరికంటి ధనలక్ష్మికి జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఆయ్యే యోగం దక్కింది. ఈనెల 4న ముగిసిన జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ పార్టీ జడ్పీటీసీగా 5302 ఓట్ల మెజార్టీని ఆమె సాధించారు. జడ్పీ చైర్మన్ పదవిని ఎస్సీలకు కేటాయించగా, వైస్ చైర్మన్ పదవిని బీసీకి చెందిన మరికంటి ధనలక్ష్మికి అవకాశం లభించింది. ఖమ్మం జిల్లా పరిషత్‌లో శనివారం జరిగిన చైర్మన్, వైస్‌చైర్మన్ అభ్యర్థుల ఎన్నిక కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ఆధ్వర్యంలో జరిగింది. సాయంత్రం జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక కార్యక్రమంలో మరికంటి ధనలక్ష్మిని వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం జడ్పీ సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చిన తరువాత వైస్ చైర్మన్ ధనలక్ష్మిని మండల టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావులను నూతనంగా ఎన్నికైన ఎంపీపీ వజ్జా రమ్య, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మిలు, మండల టీఆర్‌ఎస్ నాయకులు కలిశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉన్నం బ్రహ్మయ్య, మండల కార్యదర్శి కోటి సైదారెడ్డి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ కొర్లకుంట నాగేశ్వరరావు, ఎంపీపీ నందిగామ కవితారాణి, జడ్పీటీసీ తేజావత్ అనిత, రైతు సమన్వయ సమితీ మండల కన్వీనర్ యడవల్లి సైదులు, నాయకులు నెల్లూరి భద్రయ్య, నంబూరి సత్యనారాయణ, కోటి శ్రీనివాసరావు, మండల మహిళా అధ్యక్షురాలు చెరువు స్వర్ణ, ప్రధానకార్యదర్శి రాళ్లబండి రాజకుమారి, ఎంపీటీసీ అనగాని నరసింహరావు, సర్పంచ్ గండు సతీష్, కొడాలి గోవిందరావు, నేరళ్ల నరసింహరావు, నర్రా పూర్ణచందర్‌రావు, వజ్జా శ్రీనివాసరావు, దండా రంగయ్య, పెద్దపాక వెంకటేశ్వర్లు, బచ్చలకూరి శ్రీనివాసరావు, పేరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles