ఉమ్మిడి ఖమ్మం జిల్లాలో ఉద్యమకారులకు దక్కిన గౌరవం

Sun,June 9, 2019 05:50 AM

మామిళ్లగూడెం, జూన్ 8 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం లభించింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ గులాబీ జెండా పట్టుకుని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నింపిన వారికి ముఖ్యమంత్రి, గులాబీ నేత కేసీఆర్ గుర్తించి సముచిత స్థానాన్ని కల్పించారు. ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలం నుంచి మరికంటి రేణుబాబు భార్య మరికంటి ధనలక్ష్మికి జడ్పీటీసీ సీటు కేటాయించడంతో పాటు గెలిచిన తరువాత ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్‌గా ప్రకటించారు. మరికంటి రేణుబాబు 2002 నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో క్రియాశీలక నాయకుడిగా, మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం జరిగిన అన్ని సంవత్సరాలు మండలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవిష్కరణ వరకు గులాబీ జెండాను భుజాన మోశారు. 2008 నుంచి 2013 వరకు టీఆర్‌ఎస్ మండల అధ్యక్షునిగా పనిచేశారు. 2003లో బైరవునిపల్లి గ్రామ అధ్యక్షుడిగా, మండల పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2006లో తన స్వగ్రామం బైరవునిపల్లిలో పార్టీ అభ్యర్థిగా వార్డులో పోటీ చేసి గెలుపొందారు. టీఆర్‌ఎస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన రేణుబాబు తెలంగాణ ఉద్యమంలో చురకైన పాత్ర పోషించి పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో ఆరెస్ట్ అయ్యారు. 2014 ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఆ తరువాత టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీలోనే క్రీయాశీలక నాయకునిగా పని చేస్తూ 2018లో ఆత్మ కమిటీ డైరెక్టర్‌గా నియామకం పొందారు. రేణుబాబు సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం నేలకొండపల్లి జడ్పీస్థానాన్ని ఆయన భార్య మరికంటి ధనలక్ష్మికి కేటాయించడంతో భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ మండలంగా పేరొందిన నేలకొండపల్లి ఆ పార్టీని చిత్తుచేసి విజయం సాధించడంతో గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రేణుబాబు భార్యకు జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్‌గా ఎంపిక చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా కంచర్ల
ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా సుదీర్గకాలం పనిచేసిన కొత్తగూడెం వాసి కంచర్ల చంద్రశేఖర్‌రావకు టీఆర్‌ఎస్ పార్టీ సముచిత స్థానం కల్పించింది. ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి జిల్లాలో ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకుపోవడంతో పాటు గులాబీ జెండాను భుజన వేసుకుని ఉద్యమించిన సీనియర్ నాయకులు కంచర్లకు కొత్తగూడెం జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ పదవిని కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, కార్యనిర్వహణ అధ్యక్షులు కేటీఆర్‌లు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున్న జరుగుతున్న సమయంలో కొత్తగూడెం ప్రాంతంలో ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. నాటి ఉద్యమకారుడిగా రాష్ట్రం కోసం పోరాడిన కంచర్ల చంద్రశేఖర్‌రావుకు చుంచుపల్లి మండల జడ్పీటీసీ స్థానాన్ని కేటాయిండంతో పాటు గెలిచిన తరువాత జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్‌గా ఎన్నిక చేశారు. జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన నాయకులు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోను సముచిత స్థానం కల్పిస్తు గౌరవ ప్రధమైన పదవులను అందిస్తున్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles