అంచలంచెలుగా ఎదిగిన లింగాల కమల్‌రాజ్

Sun,June 9, 2019 05:50 AM

మధిర, నమస్తేతెలంగాణ/మామిళ్లగూడెం : సామాన్య కుటుంబంలో జన్మించి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసించి ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘంలో చురుకైన కార్యకర్తగా 8వ తరగతి నుంచే పనిచేస్తూ సీపీఎం పార్టీలో హోల్‌టైమర్‌గా పనిచేస్తూ వైరా ఎంపీపీగా ఎన్నికైన లింగాల కమల్‌రాజు అంచలంచెలుగా ఎదిగి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని అదిష్టించారు. 1987 ఇంటర్‌లో కళాశాల కమిటీ కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ ఖమ్మం డివిజన్ కమిటీ మెంబర్, డిగ్రీ కళాశాల కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు. 1995లో వైరా మండల పరిషత్ అధ్యక్షునిగా, 1996లో డీవైఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్షునిగా, 1996లో సీపీఎం మధిర డివిజన్ కమిటీ సభ్యునిగా, 2001 నుంచి 2005 వరకు డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శిగా, 2005 డిసెంబర్‌లో వైరా నుంచి మధిరకు వచ్చారు. సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శిర్గ సభ్యునిగా, జిల్లా కమిటీ సభ్యునిగా, వ్యవసాయ కార్మికసంఘం డివిజన్ కార్యదర్శిగా, రాష్ట్రకమిటీ సభ్యుడిగా కొనసాగారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీచేశారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నియోజకవర్గ నుంచి సీపీఎం అభ్యర్థిగా వైసీపీ మద్దతుతో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 28-11-2014న సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 19-10-2015న పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. 2015లో డిసెంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2016 మే 5న పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ టీఆర్‌ఎస్ మధిర నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు భట్టివిక్రమార్కపై టీఆర్‌ఎస్ అభ్యర్థిగా లింగాల కమల్‌రాజు పోటీచేశారు. ఆ ఎన్నికలో భట్టివిక్రమార్క 3567 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయినప్పటికీ మధిర నియోజకవర్గంలో అత్యధిక ఓటింగ్ శాతాన్ని లింగాల కమల్‌రాజు సాధించారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles