నేడే జడ్పీచైర్మన్ ఎన్నిక

Sat,June 8, 2019 06:14 AM

-చైర్మన్‌గా లింగాల కమల్‌రాజు వైస్ చైర్మన్‌గా మరికంటి ధనలక్ష్మి
-భద్రాద్రి జడ్పీ చైర్మన్‌గా కోరం కనకయ్య, వైస్ చైర్మన్‌గా కంచర్ల చంద్రశేఖర్

(ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ);జిల్లా పరిషత్ చైర్మన్‌గా లింగాల కమలరాజ్‌ను ప్రకటిస్తూ టీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో భారీ విజయాన్ని సాధించిన టీఆర్‌ఎస్ పార్టీ జడ్పీ పీఠంపై గులాబీ జెండాను ఎగరవేసింది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వు కావడంతో ఆ వర్గానికి చెందిన లింగాల కమల్‌రాజ్‌కు అవకాశాన్ని కల్పిస్తూ టీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయం ప్రకటించింది. వామపక్ష భావజాలంతో రాజకీయాలు ప్రారంభించిన లింగాల కమల్‌రాజ్.. సీపీఎం నుంచి వైరా ఎంపీపీగా పనిచేశారు. ఆ తరువాత మధిర నియోజకవర్గం నుంచి సీపీఎం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీలో చేరి పోటీ చేసినా విజయం వరించలేదు. మారిన రాజకీయ పరిణామాలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. నాటి నుంచి టీఆర్‌ఎస్ పార్టీకి క్రీయాశీలక నాయకుడిగా మధిర నియోజకవర్గంలో పని చేస్తున్నారు. లింగాల కమల్‌రాజ్ పని విధానాన్ని మెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధిర ఎమ్మెల్యే అభ్యర్థిగా టీఆర్‌ఎస్ నుంచి పోటీకి దించారు.

కాంగ్రెస్ పార్టీ కార్యానిర్వహణ అధ్యక్షుడు మల్లుభట్టి విక్రమార్కపై స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. దీంతో పార్టీ అవసరాలు, మధిర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం కోసం ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో మధిర మండలం నుంచి జడ్పీటీసీగా పోటీచేసి విజయం సాధించారు. దీంతో లింగాల కమల్‌రాజ్‌కు జడ్పీ చైర్మన్ పదవిని టీఆర్‌ఎస్ అధిష్టానం కట్టబెడుతోంది. అలాగే జడ్పీ వైస్ చైర్మన్‌గా నేలకొండపల్లి జడ్పీటీసీగా ఎన్నికైన మరికంటి ధనలక్ష్మీని ప్రకటించారు. మరికంటి ధనలక్ష్మీ భర్త రేణుబాబు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా పనిచేశారు. 2002 నుంచే టీఆర్‌ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన రేణుబాబును ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి అతని భార్యకు అవకాశం కల్పించారు. కో ఆప్షన్ సభ్యులుగా వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలకు చెందిన వారికి అవకాశం కల్పించాలని స్వయంగా టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిర్ణయం ప్రకటించడంతో ఆ నియోజకవర్గాల నుంచి కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగనుంది.

ఉదయం కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక
జడ్పీటీసీకి సమానస్థాయిలో ఉండే కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉదయం నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఎన్నికల అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం రెండు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు అవసరమైన ప్రక్రియను ఉదయం 10 గంటల వరకు నిర్వహిస్తారు. ఆ తరువాత జడ్పీచైర్మన్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలించి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జడ్పీచైర్మన్ ఎన్నికకు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. సాయంత్రం 3 గంటల వరకు జడ్పీ చైర్మన్ ఎన్నికను చేతులెత్తే పద్ధతిన నిర్వహించాల్సి ఉంది. అయితే టీఆర్‌ఎస్‌కు అత్యధిక స్థానాలు ఉండటంతో జడ్పీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
జడ్పీ చైర్మన్ ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం శనివారం జరగాల్సిన జడ్పీ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు శుక్రవారం రాజకీయ పార్టీల నుంచి విప్ పత్రాలను స్వీకరించారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి జిల్లా పరిషత్ ఎన్నికల విప్‌గా నియామకం పొందిన నూకల నరేష్‌రెడ్డి.. జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌ను కలిసి విప్ పత్రాన్ని అందజేశారు. జిల్లా పరిషత్‌లో జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కూర్చొనేందుకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచే జిల్లా పరిషత్‌లో చైర్మన్ ఎన్నికకు అధికారులు ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటికే జడ్పీటీసీలకు, ఎంపీపీలకు జిల్లాలోని ప్రజాప్రతినిధులకు, అధికారులకు సమాచారాన్ని అందజేశారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles