విలీనానికి అడుగులు

Fri,June 7, 2019 06:04 AM

-సీఎల్పీ విలీనంలో ఖమ్మం ఎమ్మెల్యేలదే కీలక పాత్ర....
-లేఖ ఇచ్చిన 12 మందిలో నలుగురు మనవాల్లే...
- కాంగ్రెస్, టీడీపీ నుంచి త్వరలో ఇద్దరు రాక...?
-ఉమ్మడి జిల్లాలో మిగిలేది భట్టి ఒక్కరే...
-ఎమ్మెల్యేల చేరికకు ఓటుతో మద్దతిచ్చిన ప్రజలు
ఖమ్మం, నమస్తే తెలంగాణ :తెలంగాణలో కాంగ్రెస్ శాసనస భ పక్షం తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేయడానికి తొలి అడుగు పడింది. దీనిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలదే కీలక పాత్ర కానుంది. సీఎల్‌పీ విలీనంతో శాసనసభలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పొనుంది. ఇప్పటికే అన్ని ఎన్నికలలో చావు దెబ్బ తిన్న కాంగ్రెస్ ముక్కుతూ, మూలుగే దశలో ఉంది. కేవలం వేళ్ల మీద లెక్కపెట్టే ప్రజాప్రతినిధులే ఆ పార్టీకి ఉన్నారు. దీంతో ఆ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లోకి వలస వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కు మార్‌రెడ్డి బుధవారం శాసనసభకు రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 18 కి చేరింది. రాజ్యాంగం ప్రకారం ఒక రాజకీయ పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేలలో మూడింట రెండోంతుల మంది రాజీనామా చేస్తే ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోతుంది. గురువారం కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని అసెంబ్లీ కార్యదర్శి లే ఖను అందజేశారు. ఈ 12 మంది ఎమ్మెల్యేలలో ఉమ్మడి ఖ మ్మం జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, పినపాక ఎ మ్మెల్యే రేగా కాంతారావులున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఖమ్మం జిల్లానే కీలకం...
రాష్ట్ర రాజకీయాలలో ఖమ్మం జిల్లా కీలకపాత్రను పోషిస్తుంది. రాజకీయంగా, సామాజికంగా చైతన్యం కలిగిన జిల్లా ప్రజలు ప్రతీ ఎన్నికల్లోను వినూత్నమైన తీర్పును ఇస్తారు. ఎన్నికలలోనే కాకుండా రాష్ట్రంలో జరిగిన అనేక ప్రజా ఉద్యమాలకు కూడా ఖమ్మం నిలయంగా మారిన సంఘటనలు అనేకం ఉన్నాయి. రాష్ట్ర చరిత్ర గతిని మార్చిన నాటి ఉద్యమనేత కేసీఆర్ ఆమరణ దీక్షను కూడా మలుపు తిప్పింది ఖమ్మం జిల్లా ఉద్యోగులు, ప్రజలే... అనేది యదార్థం...అయితే 2018 డిసెంబర్ 7న జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. యావత్ తెలంగాణ మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితికి బ్రహ్మరథం పట్టి అత్యధిక స్థానాలను టీఆర్‌ఎస్ గెలుసుకునేలా చేశాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలలో ఒకే ఒక్కటి మాత్రమే టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. మిగిలిన 9 స్థానాలలో రెండు చోట్ల తెలుగుదేశం, 6 చోట్ల కాంగ్రెస్, 1 చోట స్వతంత్ర అభ్యర్థిని గెలిపించారు. తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం పరంపర కొనసాగిస్తే ఖమ్మంలో మాత్రం ప్రజలు మరోరకంగా తీర్పునివ్వడం జరిగింది. 2014 ఎన్నికల్లోను టీఆర్‌ఎస్ పార్టీకి ఒకే ఒక సీటు సాధించింది. ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, తెలుగుదేశం అభ్యర్థులనే గెలిపించడం జరిగింది. కాగా శాసనసభ ఎన్నికల అనంతరం ఉమ్మడి ఖమ్మంలో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారాయి. ఎన్నికలు జరిగిన నెల రోజులలోపే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి గెలుపొందిన శాసనసభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సుముకత వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నేరుగా కలిసి టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. వీరిలో ముందుగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఉండగా ఆ తరువాత ఇల్లెందు, పాలేరు, కొత్తగూడెంకు చెందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హరిప్రియానాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావులు ఉన్నారు. వీరితో పాటు సత్తుపల్లి నుంచి గెలుపొందిన సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు.

విలీనానికి మద్దతు తెలిపిన ప్రజా తీర్పు....
తెలంగాణ శాసనసభ ఫలితాల తరువాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు సిద్ధం కావడం, స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ బలం ఒక్కసారిగా పెరిగింది. ఎమ్మెల్యేల నిర్ణయం తరువాత జరిగిన గ్రామపంచాయతీ, పార్లమెంట్, జిల్లా, మండల పరిషత్ ఎన్నికలలో ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మర థం పట్టారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలలో ఆ పార్టీ భారీ మెజార్టీని సాధించింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు గెలిచిన స్థానాలైన పాలేరు, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, సత్తుపల్లి నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు అత్యధిక మెజార్టీ రావడం జరిగింది.
మిగిలిన నియోజకవర్గాలైన మధిర అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలలో కూడా టీఆర్‌ఎస్ ఎనలేని మెజార్టీని ఇచ్చారు. దీని వలన ఎమ్మెల్యేల పార్టీ మారే నిర్ణయం సరైనదేనని ప్రజలు తమ ఓటు ద్వారా తెలియజేశారు. ఇటీవల జరిగిన జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా ప్రజలు టీఆర్‌ఎస్‌కు 90 శాతం సీట్లను అప్పగించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల జడ్పీ పీఠాలపై గులాబీ జెండా ఎగిరేలా స్పష్టమైన తీర్పును ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఉమ్మడి జిల్లా ప్రజలు సంపూర్ణ మద్దతును తెలియజేయడం జరిగింది.

ఉమ్మడి ఖమ్మంలో మిగిలింది ముగ్గురే..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 ఎమ్మెల్యేల్లో టీఆర్‌ఎస్ ఖాతాలోకి ఏడుగురు వచ్చారు. ఇక మిగిలింది ముగ్గురు ఎ మ్మెల్యేలే. వీరిలో కూడా ఇద్దరు టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. టీఆర్‌ఎస్‌లో చేరకుండా ఉన్నవారి లో మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క, తెలుగుదేశానికి చెందిన అశ్వారా వుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, కాంగ్రెస్‌కు చెందిన భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యలున్నారు. వీరిలో సీఎల్పీనేతగా ఉన్న భట్టి టీఆర్‌ఎస్‌లోకి వచ్చే అవకాశం ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన భద్రాచలం ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలను గెలుచుకుంది. వీరిలో ఒకరు సత్తుపల్లి ఎమ్మె ల్యే వెంకటవీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావులున్నారు. అయితే సండ్ర ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరినట్లే. ఇక మిగిలింది అశ్వారావుపేట ఎమ్మెల్యే మాత్రమే అయితే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడం, తెలంగాణలో అసలు ఉనికేలేకుండా ఉండటంతో మెచ్చా కూడా టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఏపీలో ఒక వేళ తెలుగుదేశం అధికారంలోకి వస్తే తనకు ఏదైనా పదవి వస్తుందనే ఆశతోనే మెచ్చా ఇన్ని రోజులు నాన్చే ధోరణిలో ఉన్నారని, ఏపీ ఫలితాలు వచ్చాక మెచ్చా పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఆయన కూడా టీఆర్‌ఎస్‌లోకి వచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ కూడా టీఆర్‌ఎస్‌లో విలీనం అయినట్టే.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles