శభాష్ శరణ్య

Fri,June 7, 2019 06:02 AM

ఖమ్మం ఎడ్యుకేషన్: సాధించాలనే పట్టుదల...సాధించగలమనే నమ్మకం.. ఈ రెండూ ఉంటే విజయానికి ఎదురుండదు. మనిషి తన మేధోశక్తితో ముందుకు సాగితే అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయగలడు. ఇది జగమెరిగిన సత్యం. అందరిలా పాఠశాలకు వెళ్లకుండా ఉంటే ఎందరో విమర్శించారు, వాటిని ఎదుర్కోంటూ ప్రణాళికలతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఔరా అనిపించింది... ఖమ్మం నగరానికి చెందిన భూమా శరణ్య. ఖమ్మంలోని డాక్టర్స్ మెడికల్ అకాడమీలో(డీఎంఏ) శిక్షణ పొంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం ప్రకటించిన నీట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటి 620 మార్కులు సాధించి ఇప్పుడు ఎందరో విద్యార్థులకు మార్గదర్శి అయింది. విద్యార్థిని సాధించిన విజయానికి గురువులు ఒకింత కారణమైతే ...తనకున్న పట్టుదల, తపన విజయానికి సోపానాలుగా నిలిచాయి. నీట్ ర్యాం కర్ శరణ్య విజయ రహస్యంపై నమస్తే తెలంగాణ
ప్రత్యేక కథనం...
సాధారణ విద్యార్థ్ధి నుంచి .... ఒకటి నుంచి ఆరో తరగతి వరకు నగరంలోని చిన్న చిన్న పాఠశాలల్లో చదివింది. తల్లిదండ్రులు పెద్దగా చదువుకోపోయినప్పటికీ వృత్తిరిత్యా వ్యాపార రంగంలో ఉండటంతో అమ్మాయిని బాగా చదివించాలని 7,8వ త రగతులు పెద్ద స్కూల్స్‌లో చదివించారు. ఆ సమయంలో పాఠశాలలో ఉన్న ప్రభావం ఇతరత్రా కారణాలు ఎక్కువ రోజులు పాఠశాలలకు వెళ్లలేదు. తర్వాత చదువు అంటే ఆసక్తి తగ్గి ఎక్కువగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కి అలవాటు పడి, చదువు పట్ల అనాసక్తిని పెంచుకుంది. స్నేహితులతో గడిపేందుకు ఇష్టపడి చదువు పట్ల నిర్లక్ష్యం చేసింది. సాధారణ విద్యార్థిగా ఉన్న శరణ్య పలువురికి ఆదర్శంగా ఉండే స్థాయికి తీసుకురావడంలో సతీష్ సార్‌దే కృషి. తెలంగాణ నా రాయణ స్కూల్‌లో అడ్మిషన్ సమయంలో కైనటిక్ ఎనర్జి ఫార్ములా సమాధానం తప్పుగా చెప్పడం, తర్వాత అదే ఫిజిక్స్‌ను ఆ సారే బోధించడంతో తపస్సులా చదివింది. కొన్ని రోజుల తర్వాత నిర్వహించిన పరీక్షలో సెకండ్ ర్యాంక్ రాగా, ఫస్ట్ ర్యాంక్ కొరకు కృషి చేస్తూ కొనసాగింది.
స్వప్నాన్ని నిజం చేసింది... ఇంటర్ పరీక్షలకు సరిగ్గా నెలరోజుల సమయం. ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది. రెండు చేతులకు కట్టు కట్టారు. పరీక్షలు రాయలేని పరిస్థితి ఆ సమయంలో ధైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసం పెంపొందించుకుం ది. ఎట్టకేలకు పరీక్షలు రాసి 985 మా ర్కులు సాధించింది. ప్రతిభకు మార్కులు ఒక్కటే కొలమానం కాదు, విజ్ఞానం ఆధారంగా ప్రతిభ గుర్తించాలనే దిశగా శరణ్య విద్యాభ్యాసం సాగింది.ప్రతి ప్రశ్నాపత్రాన్ని సలువుగా సమాధానాలు గుర్తించే స్థాయి లో సబ్జెక్ట్ నేర్చుకుంది. తల్లిదండ్రులు పుల్లారావు, కృష్ణకుమారిలు సైతం సమయంతో సంబం ధం లేకుండా అనునిత్యం తోడుగా ఉన్నారు. వారి సహకారం, శరణ్య సంకల్పానికి విజ యం దాసోహమయ్యింది. అంకుఠిత దీక్ష... బలమైన ఆకాంక్షలే స్వప్నాన్ని నిజం చేశాయి.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles