కొత్త తొవ్వ పుస్తకం ఆవిష్కరణ

Fri,June 7, 2019 06:01 AM

ఖమ్మం కల్చరల్ : వరుణుడు సరస్వతి కటాక్షానికి సహకరించాడు.. మండుటెండ ఉక్కపోతలో సేదతీర్చుతూ వాన తుంపరల నడుమ విజ్ఞాన సర్వస్వం తడిసి ముద్దయింది.. చల్లటి చదువులమ్మ ఒడిలో పుస్తక ప్రియులు సేదతీరారు. గురువారం సాయంత్రం ఓ మోస్తారు భారీ వర్షం కురిసినప్పటికీ, పెవిలియన్ గ్రౌండ్‌లో గల పుస్తక మహోత్సవ సమయానికి వాన తగ్గి విజ్ఞాన బాంఢాగారానికి తలవొంచినట్లుయింది. దీంతో ఎప్పటిలాగే విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో హాజరై పుస్తకాలను కొనుగోలు చేశారు. చల్లటి వాతా వరణంలో తమకు కావాల్సిన మరిన్ని పుస్తకాలను కొనుగోలు చేసి మురిసి పోయారు. మారంరాజు సత్యనారాయణ వేదికపై సాంస్కృతిక సారథులు ఆలపించిన పలు గీతాలు చైతన్యపర్చాయి. ఆ చల్లని సముద్రగర్భం, బతుకు పోరుబాటలో భవిత ఉంది తెలుసుకో అంటూ పలు పాటలను ఆలపించి మైమర్పించారు. ఈసందర్భంగా నిర్వహించిన సభలో దళిత బహుజన రచయితలు,కళాకారుల ఐక్యవేదిక సంపాదకత్వంలో రచించిన కొత్త తొవ్వ పుస్తకాన్ని కలెక్టర్ కర్ణన్, జూలూరు గౌరీశంకర్‌లు ఆవిష్కరించారు. దబరకమే ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి, కవి పంజాల ఐలయ్య, సీతారాములు, నిర్మల, లెనిన్ శ్రీనివాస్ తదితరులు ఈ పుస్తకాన్ని ఆవిష్కరణలో పాల్గొన్నారు. కవి సీతారాం పుస్తక సమీక్ష చేశారు. నవ తెలంగాణ ప్రచురణలో చందా రామయ్య రాసిన బేతవోలు జమీందారీ వ్యతిరేక రైతాంగ ఉద్యమం పుస్తకాన్ని ఆవిష్కరించారు. జాతీయ విద్యామండలి సభ్యుడు కె.రామదాసు ఈ సభలో పాల్గొని మాట్లాడుతూ రైతాంగ పోరాటంలో బేతవోలు ఉద్యమం ఎంతో కీలక మైందన్నారు. రైతు కూలీ సంఘం అధ్యక్షుడు ఎం.వెంకట్ మాట్లాడుతూ ఈ నాటి యువత ఈ ఉద్యమం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా సాహితీ వేత్త డాక్టర్ దిలావర్, సంఘ సేవకుడు అన్నం శ్రీనివాస్‌లను కలెక్టర్ కర్ణన్, ఇతర అతిథులు ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా విష్‌లిస్ట్ పాట్, అమెజాన్ కిండిల్ విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా బృహత్‌శిలాసంస్కృతిపై ప్రొఫెసర్ జాన్‌మిల్టన్, చరిత్రపై కట్టాశ్రీనివాస్‌లు ప్రసంగించారు. కార్యక్రమం లో హైద్రాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్ష,కార్యదర్శులు జూలూరు గౌరీశంకర్, కోయ చంద్రమోహన్, స్పర్శ సామాజిక వేదిక కాకి భాస్కర్, కవి, జర్నలిస్ట్ ప్రసేన్, కవి సీతారాం, విజేత, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles