ప్రాదేశిక పోరులో..గులాబీ ప్రభంజనం

Wed,June 5, 2019 03:06 AM

-కారు జోరుకు.. ప్రతిపక్షాలు బేజారు..
-భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ పీఠం టీఆర్‌ఎస్ కైవసం
-కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు..
-వామపక్షాల ఓటు బ్యాంకు కల్లాస్
-ఉనికికోల్పోయిన తెదేపా..

పల్లె పూదోటలో గులాబీ వికసించింది.. ప్రాదేశిక పోరులో ఊరూరా కారుజోరు కొనసాగింది. జిల్లాలో మూడు విడతలుగా జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 21 జడ్పీటీసీ స్థానాలకు లెక్కింపు జరగగా.. 16 స్థానాల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించి జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంది. 209 ఎంపీటీసీ స్థానాల్లో మూడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, 206 ఎంపీటీసీ స్థానాలకు టీఆర్‌ఎస్ 118 గెలిచింది. 21 జడ్పీటీసీ స్థానాలకు మే 6,10, 14 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. బూర్గంపాడు మండలంలో ఒక జడ్పీ స్థానానికి మాత్రమే ఎన్నికలు జరుగగా, వచ్చే నెల జూలైతో ఆ మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు గడువు పూర్తవుతున్న కారణంగా అక్కడ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. మొత్తంగా ప్రాదేశిక పోరులో జిల్లాలో అత్యధిక స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడగా.. ప్రతిపక్ష పార్టీలు ఘోర పరాజయంతో చావుదెబ్బతిన్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రాదేశికంలో గులాబీ పరిమళించిం ది.. కారు స్పీడుకు ఏ రాజకీయ పార్టీ దరిదాపులో లేకుండా కొట్టుకు పోయాయి.. తెలంగాణ రాష్ర్టా న్ని సాధించి పెట్టిన టీఆర్‌ఎస్ పార్టీనే తమ ఇంటి పార్టీగా చేసుకున్న జిల్లా ప్రజలు ప్రతీ గ్రామంలోనూ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ జిల్లాలో బలమైన శక్తిగా మారింది.ఎన్నిక ఏదైనా సరే విజయం టీఆర్‌ఎస్‌దే అన్న చందంగా... జరిగిన ప్రతీ ఎన్నికలోనూ తన ఆధిక్యాన్ని చూపిస్తూ ముందుకు సాగుతోంది. గులాబీ దళపతి సీఎం కేసీఆర్ సారధ్యంలో నూతనంగా ఆవిర్భవించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎనలేని అభివృద్ధిని సాధించింది. దీంతో జిల్లా ప్రజలు అభివృద్ధిని కాంక్షించే అధికార పార్టీని అందలమెక్కించారు.రాజకీయ పా ర్టీగా అవతరించిన ఉద్యమ పార్టీతోనే కడదాకా ప యనించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఓట్లు వేసి తమ తీర్పుతో మరోసారి చాటిచెప్పారు.
నూతనంగా జిల్లాగా ఆవిర్భవించిన భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ పీఠంపై గులాబీ జండా రెపరెపలాడింది. జిల్లాలో ఉన్న 21 జడ్పీటీసీ స్థానాలకు గాను అత్యధికంగా 16 స్థానాలను తన ఖాతాలో వేసుకొని జిల్లాలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్ పార్టీ అవతరించింది. పంచాయతీ ఎన్నికల నుంచి నేటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు ప్రతీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ తన సత్తాను చాటుతూ వచ్చిం ది.

జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు టీఆర్‌ఎస్‌కే...
జిల్లాలోని 21 మండలాల్లో 16 మండలాల జడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కేవలం మూడు స్థానాలతోనే కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకోగా, ఒక స్థానంలో ఇండిపెండెం ట్, ఒక స్థానంలో న్యూడెమోక్రసీ పార్టీ గెలిచింది. ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, టేకులపల్లి, చుంచుపల్లి, దమ్మపేట, పాల్వంచ, పినపాక, సుజాతనగర్, కరకగూడెం, అశ్వాపురం, దుమ్ముగూడెం, అశ్వారావుపేట, బూర్గం పాడు, మణుగూరు, ఇల్లెందు, జూలూరుపాడు మండలాల జడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. చండ్రుగొండ, ములకలపల్లి, చర్ల జడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా, గుండాల జడ్పీటీసీ స్థానాన్ని న్యూడెమోక్రసీ పార్టీ, లక్ష్మీదేవిపల్లి జడ్పీటీసీ స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు. అత్యధికంగా 16 స్థానాలను గెలుచుకున్న టీఆర్‌ఎస్ పార్టీ ఈ నెల 8న జరగనున్న జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను అలవోకగా దక్కించుకోనుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 మండలాల్లోని 209 ఎంపీటీసీ స్థానాలకు గాను 118 స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీకి 26, టీడీపీకి 11, సీపీఐకి 16, సీపీఎంకు 9, ఎన్డీకి 9, స్వ తంత్రులు 20 స్థానాలను గెలుచుకున్నారు. దీం తో ఈ నెల 7న జరగనున్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలను అత్యధిక ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్ పార్టీ దక్కించుకోనుంది.

మూడు ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ ఏకగ్రీవం
జిల్లాలో 209 ఎంపీటీసీ స్థానాలకు గాను మూడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీ వమయ్యాయి. టేకులపల్లి మండలం కోయగూడెం ఎంపీటీసీగా జాలె సంధ్య, పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి ఎంపీటీసీగా గొంది శిరోమణి, అశ్వాపురం ఎంపీటీసీగా కందాల దుర్గాభవానిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీమైన మూడు ఎంపీటీసీ స్థానాలు టీఆర్‌ఎస్ ఖాతాలో పడ్డాయి. దీంతో 118 ఎంపీటీసీ స్థానాలు టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. 118 ఎంపీటీసీ స్థానాలు, 16 జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసినైట్లెంది. కొన్ని మండలాల్లో ప్రత్యర్థి పార్టీల అడ్రస్ గల్లంతైంది.

కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, ఎస్పీలు...
కౌంటింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ, ఎస్పీ సునీల్‌దత్‌లు సందర్శించారు. ఉదయమే కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి కౌంటింగ్ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరం వరకే పార్టీల నాయకులను అనుమతిస్తూ పటిష్ట బందోబస్తు మధ్య కౌంటింగ్ నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరింపజేసి సజావుగా సాగేలా చూశారు. ఈ కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వ హించినందుకు కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ, ఎస్పీ సునీల్‌దత్ కౌంటింగ్ సిబ్బందికి, వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

అంబరాన్నంటిన సంబురాలు..
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 209 ఎంపీటీసీ, 21 జడ్పీటీసీ స్థానాల్లో 118 ఎంపీటీసీ స్థానాలు, 16 జడ్పీటీసీ స్థానాలను అత్యధికంగా టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రెండు కేంద్రాల్లో, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, అశ్వారావుపేటలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఉదయాన్నే భారీ ఎత్తున చేరుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు టీఆర్‌ఎస్ పార్టీ జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకో నుండటంతో పెద్ద ఎత్తున సంబురాలు చేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉమెన్స్ కాలేజీ కౌంటింగ్ కేంద్రానికి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చేరుకొని గెలిచిన జడ్పీటీసీ అభ్యర్థులతో కలిసి సంబురాల్లో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య టేకులపల్లి జడ్పీటీసీగా విజయం సాధించటంతో పాల్వంచలోని కౌం టింగ్ కేంద్రం వద్ద సంబురాలు అంబురాన్నంటాయి. మణుగూరు కౌంటింగ్ కేంద్రం వద్ద పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎమ్మె ల్యే పాయం వెంకటేశ్వర్లు విజయోత్సవ సంబురాల్లో పాల్గొన్నారు. ఇల్లెందులోని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తన క్యాం పు కార్యాలయం వద్ద జరిగిన సంబురాల్లో పాల్గొన్నారు.

అధికారుల అలసత్వంతో ఫలితాలు ఆలస్యం...
రాష్ట్రమంతటా ఉదయం ఎనిమిది గంటలకే కౌంటింగ్ ప్రా రంభమై రౌండ్ల వారీగా ఫలితాలు 10.30 గంటలకల్లా వెలువడుతుంటే కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో మాత్రం మధ్యాహ్నం 12 గంటలు దాటినా ఫలితాలు వెలువడలేదు. ఉదయమే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది తొలుత పోస్టల్ ఓట్లు లెక్కించారు.అనంతరం బ్యాలెట్ బాక్సులు తేవ డం, వాటిని తెరవడం ఆలస్యమైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు వెలువడుతున్నా కొత్తగూడెంలో మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు వెలువరించారు. ఫలితాల ఆలస్యంలో అధికారులు అలసత్వం తేటతెల్లమవుతోంది. కౌంటింగ్ ప్రక్రియను ముం దుకు తీసుకు పోవడంలో సిబ్బంది విఫలమైనట్లు చెప్పవచ్చు. కౌంటింగ్ కేంద్రాలకు కలెక్టర్, జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌లు వచ్చిన అనంతరం కౌంటింగ్ ప్రక్రియ వేగం పుంజుకుంది.

7న ఎంపీపీ, 8న జడ్పీ చైర్మన్ ఎన్నికలు
ఈ నెల 7న మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగనుంది. మరుసటి రోజు 8వ తేదీన జిల్లా పరిషత్ అధ్యక్షుడు, ఉపా ధ్యక్షుడు, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్‌ఎస్ 16 జడ్పీటీసీ స్థానాలను గెలుచుకొని ఇప్పటికే జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను తమ ఖాతాలో వేసుకుంది. జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికలు లాంఛనంగా జరగనున్నాయి. ఈ ఎన్నికల ఇన్‌చార్జిగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావును నియమిస్తూ టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ ఎన్నికలను అందరినీ సమన్వయం చేసి అత్యధిక ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలను దక్కించుకునేలా చూడనున్నారు.

మండలాల వారీగా జడ్పీటీసీ స్థానాలు గెలిచిన పార్టీలు, అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు...
మండలం జడ్పీటీసీ పేరు సాధించిన ఓట్లు పార్టీ
అశ్వాపురం ఎస్.సులక్షన 11,680 టీఆర్‌ఎస్
బూర్గంపాడు కామిరెడ్డి శ్రీలత 11,425 టీఆర్‌ఎస్
దుమ్ముగూడెం తెల్లం సీతమ్మ 9801 టీఆర్‌ఎస్
పాల్వంచ బరపటి వాసుదేవరావు 8,939 టీఆర్‌ఎస్
టేకులపల్లి కోరం కనకయ్య 16,946 టీఆర్‌ఎస్
అశ్వారావుపేట చిన్నంశెట్టి వరలక్ష్మీ 18,487 టీఆర్‌ఎస్
అన్నపురెడ్డిపల్లి బరత లాలమ్మ 6,570 టీఆర్‌ఎస్
దమ్మపేట పైడి వెంకటేశ్వరరావు 17,218 టీఆర్‌ఎస్
జూలూరుపాడు భూక్యా కళావతి 13,118 టీఆర్‌ఎస్
కరకగూడెం కొమరం కాంతారావు 4,710 టీఆర్‌ఎస్
పినపాక దాట్ల సుభద్రాదేవి 10,790 టీఆర్‌ఎస్
మణుగూరు పోషం నర్సింహారావు 7,012 టీఆర్‌ఎస్
ఆళ్లపల్లి కొమరం హనుమంతరావు 2,319 టీఆర్‌ఎస్
చుంచుపల్లి కంచర్ల చంద్రశేఖర్‌రావు 10,254 టీఆర్‌ఎస్
సుజాతనగర్ లావుడ్యా బిందుచౌహాన్ 8,438 టీఆర్‌ఎస్
ఇల్లెందు వాంకుడోత్ ఉమదేవి 14,432 టీఆర్‌ఎస్
చండ్రుగొండ కొనకండ్ల వెంకటరెడ్డి 9,032 కాంగ్రెస్
చర్ల ఇర్పా శాంత 7,945 కాంగ్రెస్
ములకలపల్లి సున్నం నాగమణి 8058 కాంగ్రెస్
గుండాల వాగబోయిన రామక్క 3,501 న్యూడెమోక్రసీ

జిల్లాలో గెలిచిన ఎంపీటీసీ స్థానాలు పార్టీల వారీగా...
మండలం ఎంపీటీసీ స్థానాలు టీఆర్‌ఎస్ కాంగ్రెస్ టీడీపీ సీపీఐ ఎన్డీ సీపీఎం ఇతరులు
చుంచుపల్లి 12 06 01 00 03 00 00 02
సుజాతనగర్ 08 04 02 00 01 00 00 01
పాల్వంచ 10 07 00 00 00 00 01 01
లక్ష్మీదేవిపల్లి 11 05 01 00 03 00 00 02
ఇల్లెందు 16 13 00 00 00 03 00 00
టేకులపల్లి 14 07 00 00 00 00 00 07
జూలూరుపాడు 10 07 02 00 00 00 00 01
గుండాల 05 00 01 01 00 03 00 00
కరకగూడెం 04 04 00 00 00 00 00 00
పినపాక 09 08 00 01 00 00 00 00
మణుగూరు 11 07 01 00 02 00 01 00
ఆళ్లపల్లి 04 02 01 00 01 00 00 00
దుమ్ముగూడెం 13 04 00 00 03 00 04 02
దమ్మపేట 17 13 01 01 00 00 00 02
అశ్వాపురం 12 08 03 01 00 00 00 00
అశ్వారావుపేట 17 10 03 03 00 01 00 00
చండ్రుగొండ 08 05 02 01 00 00 00 00
అన్నపురెడ్డిపల్లి 06 03 03 00 00 00 00 00
చర్ల 12 03 05 00 02 00 02 00
ములకలపల్లి 10 02 00 03 01 02 01 01
మొత్తం 209 118 26 11 16 09 09 20

109
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles