ఎనిమిదేళ్లకే నూరేళ్లు నిండాయా బిడ్డా...!

Wed,June 5, 2019 03:05 AM

కొత్తగూడెం క్రైం: అప్పటిదాకా ఆనందంగా ఉంది. ఆడుకునేందుకని అప్పుడే బయటికెళ్లింది. అంతలోనే అపస్మారక స్థితికి చేరింది. ఆ తరువాత కొద్దిసేపటికే ప్రాణాలొదిలింది. ఆ తల్లిదండ్రులు దిక్కులు పిక్కటిల్లేలా, గుండెలు పగిలేలా రోదించారు. పట్టణంలోని నెహ్రూ బస్తీకి చెందిన నిరుపేద కూలీ దంపతులు బాణోతు కుమార్, భూమిక కుమార్తె కీర్తన(8) 3వ తరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం వరకు ఇంట్లోనే ఆనందంగా గడిపింది. వాతావరణం చల్లబడిన తరువాత, ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. కాసేపటి తరువాత, తమ ఇంటి సమీపంలోని ఓ ఇంటి ముందు అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన తల్లిదండ్రులు పరుగు పరుగున వెళ్లారు. ఉలుకూ పలుకూ లేదు. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఏడ్చుకుంటూ, బిడ్డను వెంటనే వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతిచెందిందని, తలకు గాయమైందని చెప్పారు. ఈ మాట చెవిన పడినంతనే ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా పెద్దపెట్టున రోదించారు. తమ కుమార్తెను ఎవరో నెట్టివేసి ఉంటారని, తలకు గాయంతో ప్రాణాలొదిలిందని ఆ చిన్నారి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. తండ్రి కుమార్ ఫిర్యాదుతో కేసును వన్ టౌన్ ఎస్సై పండగ తిరుపతిరావు దర్యాప్తు జరుపుతున్నారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles