పరిషత్ కౌంటింగ్ ప్రశాంతం

Wed,June 5, 2019 03:05 AM

కొత్తగూడెం క్రైం: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు మంగళవారం భారీ పోలీస్ బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసింది. కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాల, వేపలగడ్డలోని అబ్దుల్ కలాం కళాశాల, అశ్వారావుపేటలోని జెడ్పీహెచ్‌ఎస్ కేంద్రాల్లో బందోబస్తును కొత్తగూడెం డీఎస్పీ షేక్ మహమ్మద్ అలీ, పాల్వంచలోని అనుబోస్ డిగ్రీ కళాశాల, ఇల్లెందులోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాల కేంద్రాల్లో బందోబస్తును ఇల్లెందు డీఎస్పీ జి.ప్రకాశరావు, మణుగూరులోని జెడ్పీహెచ్‌ఎస్, భద్రాచలంలోని ప్రభుత్వ కళాశాల కేంద్రాల్లో బందోబస్తును భద్రాచలం ఏఎస్పీ ఎం.రాజేశ్ చంద్ర పర్యవేక్షించారు. ఒక్కో కౌంటింగ్ కేంద్రం వద్ద ఇద్దరు ఇన్‌స్పెపెక్టర్లు, నలుగురు ఎస్సైలు, ఎనిమిదిమంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 15మంది కానిస్టేబుళ్లు, 20మంది స్పెషల్ పార్టీ సిబ్బంది నియమితులయ్యారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles