నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష

Mon,May 27, 2019 02:01 AM

-ఐదు సెంటర్లలో నిర్వహణ
ఖమ్మం ఎడ్యుకేషన్: అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష సోమవారం ఖమ్మం జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో జరుగనుంది. ఆన్‌లైన్ పద్ధతిలో జరుగనున్న ఈ పరీక్షకు అవసరమైన ఏర్పాట్లను ప్రఖ్యాత సాప్ట్‌వేర్ సంస్థ సిద్ధం చేసింది. ఇంటర్ ఎంపీసీ చదివిన విద్యార్థులు ఈ పరీక్షకు హజరుకానున్నారు. జిల్లాలో ఐదు ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షను నిర్వహించనున్నారు. బొమ్మ కళాశాల, డేర్, కిట్స్, లక్ష్య, ఎస్‌బీఐటీ కళాశాలల్లో పరీక్ష జరగనుంది. రెండు సెషన్లలో నిర్వహించే పరీక్ష జరుగనుంది. సెషన్-1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెషన్-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. విద్యార్థులను గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరని అధికారులు స్పష్టం చేశారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles