భద్రాద్రి రామాలయంలో భక్తుల రద్దీ..!

Mon,May 27, 2019 02:01 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం రామాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవుకావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు రామాలయానికి చేరుకున్నారు. ఆలయంలో శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియాన్ని తిలకించారు. సీతమ్మవారి నగలను ఆసక్తిగా తిలకించారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకం, ఆరాధన, అర్చన, సేవాకాలం తదితర పూజలు గావించారు. అనంతరం ఆలయంలోని బేడా మండపంలో స్వామివారికి నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు కల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. అర్చక స్వాములు రాముని విశిష్టత గురించి భక్తులకు వివరించారు. భక్తులరాకను పురస్కరించుకొని రామాలయం ప్రాంగణం సందడిగా మారింది. కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles