ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి

Mon,May 27, 2019 02:01 AM

దమ్మపేట: అందరి సహకారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం గండుగులపల్లిలోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగృహంలో ఆయన్ను కలిసి కాసేపు ముచ్చటించారు. తన గెలుపుకు కృషి చేసినందుకు తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా నామా నాగేశ్వరావును తుమ్మల సాదరంగా ఆహ్వానించారు. శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం అక్కడికి వచ్చిన నాయకులను అభిమానులను పలకరించి కరచాలనంతో కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తు ప్రణాళికపై సమాలోచనలు చేశారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధ్ది కోసం కార్యకర్తలు, నాయకులు ప్రజాప్రతినిధులు ఏకతాటిపై నిర్ణయాలు తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. వారి వెంట డీసీసీబీ డైరెక్టర్ ఆలపాటి రామచంద్రప్రసాద్, నాయకులు తుళ్లూరి బ్రమ్మయ్య, రైతు సమన్వయ కమిటీ మండల కన్వీనర్, జడ్పీటీసీ అభ్యర్థి పైడి వెంకటేశ్వరావు, దొడ్డాకుల రాజేశ్వరావు, మందలపల్లి ఉపసర్పంచ్ గారపాటి సూర్యనారాయణ(సూరి), స్థానిక నాయకులు కోటగిరి బుచ్చిబాబు, యువజన విభాగం నాయకులు కాసాని నాగప్రసాద్, కందిమళ్ళ నాగప్రసాద్, తుమ్మల శేషు, దొడ్డా ప్రసాద్, కందిమళ్ల నాగప్రసాద్, యర్రా వసంతరావు, కూకలకుంట రమేష్ తదితరులు ఉన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles