సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎంపీ కవిత

Sat,May 25, 2019 01:21 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ను మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. హైదరాబాద్‌లోని అధికార నివాసం ప్రగతిభవన్‌లో ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకురాలు, ఎంపీ కవిత స్నేహితురాలు హరితలతో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తొలిగిరిజన మహిళా ఎంపీగా ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ..మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలు తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బంజారాల సమస్యల పట్ల పార్లమెంట్‌లో తన గళం విప్పుతానని, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతానని ఆమె పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎంపీ నామా
ఖమ్మం, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన నామా నాగేశ్వరరావు శుక్రవారం మధ్యాహ్నం టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును హైద్రాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నామాతో పాటు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డిలతో కలిసి నామా ముఖ్యమంత్రిని కలిశారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓట్లను సీఎంకు నామా తెలియజేశారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత మెజారిటి ఎవ్వరికి ఖమ్మంలో రాలేదన్నారు. నిత్యం ప్రజలతో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీఎం కేసీఆర్ నామాకు సూచించారు. వారితో పాటు భరత్ తదతరులు ఉన్నారు

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles