ప్రభుత్వ గ్రామాల్లో ప్రతీ గొత్తికోయగ్రామాల్లో

Sat,May 25, 2019 01:20 AM

-కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ..
లక్ష్మీదేవిపల్లి:ప్రభుత్వ సంక్షేమ పథకాలు దరిచేర్చాలన్న ఉద్దేశంతో గొత్తికోయలగ్రామాల్లో నేరుగా పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్నట్లు కలెక్టర్ రజత్‌కుమాశైనీ తెలిపారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని గట్టుమల్లారం పంచాయతీ క్రాంతినగర్‌లో ఆయన పర్యటించి గొత్తికోయల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులకు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందజేయాలని, వారు అభివృద్ధిలోకి రావాలన్న ఆశయంతో ప్రత్యేకంగా పర్యటిస్తున్నట్లు చెప్పారు. గొత్తికోయల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేయనున్నట్లు స్పష్టం చేశారు. గ్రామంలో ఎన్ని కుటుంబాలున్నాయని అడిగి తెలుసుకున్నారు. బడి ఈడు వయసున్న ప్రతీ చిన్నారిని ఈ ఏడాది బడికి పంపేందుకు గుర్తించామని, వారిని చేర్పించే వసతి గృహాలను పరిశీలించామన్నారు. గొర్రెల యూనిట్ మంజూరు చేయాలని గొత్తికోయలు కోరగా ఆ యూనిట్‌లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గ్రామంలో తాగునీటి కోసం తవ్వుతున్న బావిని
వాహనం వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో మండుటెండలో కాలిబాటన వెళ్లి పరిశీలించారు. మంచినీరు కోసం వినియోగించేందుకు బాటమ్‌లో ఫిల్టర్ ఏర్పాట్లు చేయాలని గిరిజన సంక్షేమశాఖ ఈఈని ఆదేశించారు. గ్రామంలో ఉన్న వాగుపై అటవీశాఖ ద్వారా చెడ్‌డ్యాం నిర్మించారని, ఎత్తు తక్కువగా ఉండటం వల్ల నీటి లభ్యత తక్కువగా ఉందని చెక్‌డ్యాం ఎత్తు పెంచడం వల్ల నీరు లభ్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పగా, అందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతీ ఇంటికి సోలార్ లాంతర్లు మంజూరు చేశామన్నారు. సోలార్ ద్వారా వీధిదీపాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని, ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఈఈ కోటిరెడ్డి పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles