చోరీలకు పాల్పడిన దొంగపై పీడీ యాక్టు

Sat,May 25, 2019 01:19 AM

కొత్తగూడెం క్రైం: వరుస చోరీలకు పాల్పడి సుమారు 65 కేసుల్లో ఉన్న దొంగపై టూటౌన్ పోలీసులు పీడీయాక్టు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ తుమ్మ గోపి శుక్రవారం జైలు అధికారుల సమక్షంలో నిందితుడికి పీడీ నిర్భంద ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. పాల్వంచ మండలం మొండికట్టకు చెందిన పొన్నాల శివశంకర్ చిన్నతనం నుంచే డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ 2003 నుంచి జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడ్డాడు. ఈక్రమంలో కొంత మందితో కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడి జిల్లాలోని మండలాల్లో పగలు, రాత్రి తాళం వేసి ఉన్న ఇళ్లలో తాళం పగులగొట్టి బంగారు, వెండితో పాటు నగదు అపహరించిన కేసులు నమోదయ్యాయి. శివశంకర్‌పై ఇప్పటి వరకు 65 చోరీ కేసులు ఉన్నట్లు ఇన్‌స్పెక్టర్ గోపీ తెలిపారు. ఈ కేసుల దృష్ట్యా జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ వరుస చోరీలకు పాల్పడిన శివశంకర్‌పై పీడీ యాక్టు జారీ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జైల్‌లో ఉన్న శివశంకర్‌కు జైల్ సూపరింటెండెంట్ రామచంద్రయ్య, డిప్యూటీ జైలర్ పి. గోపి రెడ్డి, కొత్తగూడెం టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ తుమ్మ గోపి కలెక్టర్ జారీ చేసిన నిర్భంద ఉత్తర్వులను అందజేశారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles