ఖరీఫ్‌కు విత్తనాలు సిద్ధం

Sat,May 25, 2019 01:19 AM

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: ఖరీఫ్ సాగు కోసం వ్యవసాయశాఖ విత్తన ప్రణాళికను సిద్ధం చేసింది. రాయితీపై రైతులకు అందించే విత్తనాలు ఎంత మేరకు అవసరమో విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లాలోని 36 విత్తన కేంద్రాల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా పత్తికి సంబంధించిన 3.27 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని లెక్కలు తేల్చారు. బీపీటీ, ఎంటీయూ, ఆర్‌ఎన్‌ఆర్ రకాలు కలిపి వరి విత్తనాలు 7089 క్వింటాళ్లు, పెసల్లు 294 క్వింటాళ్లు, మినుములు వంద క్వింటాళ్లు, కందులు 38 క్వింటాళ్లు, వేరుసెనగలు 120 క్వింటాళ్లు, జీలుగు 1800 క్వింటాళ్లు, పిల్లిపెసర వెయ్యి క్వింటాళ్లు, జనుము 267 క్వింటాళ్లు విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు చేసింది. జూన్ మొదటి వారం కల్లా విత్తనాలను సిద్ధ్దం చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ముందస్తుగానే వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు వేసవి దుక్కులు చేసి సాగుకు సమాయత్తమవుతున్నారు. నకిలీ విత్తనాలపై వ్యవసాయ శాఖ ముందస్తు హెచ్చరికలు చేయడంతో డీలర్లు నాణ్యమైన విత్తనాలనే రైతులకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ సాగులో వరి, పత్తి సాగు చేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles