నామాకు పిడమర్తి అభినందనలు

Sat,May 25, 2019 01:19 AM

సత్తుపల్లి/ సత్తుపల్లి టౌన్, మే 24: ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించిన నామా నాగేశ్వరరావును శుక్రవారం సత్తుపల్లి నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఖమ్మంలోని నామా నివాసంలో ఆయనను కలిసి భారీ మెజార్టీతో సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ నాయకుడు షేక్ ఆయూబ్ పాషా, రామన్నపాలెం సర్పంచ్ నాగుల్‌మీరా, యాసా శ్రీకాంత్, రాందాస్ జాదవ్, రాము, మధు, నరేష్, రామకృష్ణ, అశ్వక్, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. మరో కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కూసంపూడి నర్సింహారావు, కూసంపూడి రామారావు, దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములు), కూసంపూడి కిషోర్, రాయల సత్యనారాయణ, కొప్పుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles