పటిష్ట భద్రత నడుమ కౌంటింగ్..

Fri,May 24, 2019 12:39 AM

-ఖమ్మం, మానుకోటలో కేంద్రాలు
-మూడంచెల భద్రతా విధానంలో బందోబస్తు
-వందల మంది పోలీస్ సిబ్బంది పహారా
-ఖమ్మం కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ సునీల్‌దత్

ఖమ్మం క్రైం: పార్లమెంట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా జరిగింది. గురువారం ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఓట్ల లెక్కింపు ఖమ్మంలోని విజయ ఇంజినీరింగ్ కళాశాలలో పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్ సారథ్యంలో పటిష్టమైన బందోబస్తుతో జరిగింది. పోలీసులు గతకొద్ది రోజులుగా ప్రణాళికను సిద్ధం చేసి పక్కాగా అమలుపర్చడంలో సఫలీకృతులయ్యారు. పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉండి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు భాగంగానే గట్టి భద్రత ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే, గ్రామపంచాయితీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్లమెంట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

కౌంటింగ్ కేంద్రాలలో ఆయా పార్టీల ఏజెంట్లకు పాసులుంటేనే అనుమతించాలని సీపీ తఫ్సీర్‌ఇక్బాల్ ఆదేశాలు జారీ చేశారు. అదే తరహాలో అక్కడ బందోబస్త్ నిర్వహిస్తున్న పోలీసులు సీపీ ఆదేశాలను పాటించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలక్షన్ కమిషన్ ఆంక్షలను పోలీసులు పూర్తి స్థాయిలో అమలుచేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా పోలీస్ బందోబస్త్ మాత్రం మూడంచెల పటిష్టమైన బందోబస్త్ నిర్వహించారు. 400 మంది పోలీస్ సిబ్బంది, ఏసీపీలు 10 మంది, సీఐలు 15 మంది, ఎస్.ఐలు 33 మంది, కేంద్ర బలగాలను వినియోగించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద డీసీపీ మురళీధర్ నేతృత్వంలో బందోబస్త్ పూర్తి స్థాయిలో విజయవంతం చేశారు.

అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడే ఉన్న సీపీ ఎప్పటికప్పుడు డీసీపీ ద్వారా తెలుసుకుంటూ మందుకు సాగారు. అభ్యర్థులు, ఏజెంట్లు, లెక్కింపుకు హాజరయ్యే అధికారులు వచ్చేటప్పుడు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి లోపలికి అనుమతించారు. అగ్గిపెట్టెలు, లైటర్లు, సిగరెట్లు, పేలుడుకు కారణమయ్యే ఎలాంటి వస్తువులను లోపలికి అనుమతించడకుండా పూర్తిస్థాయిలో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించారు.

ఎలక్షన్ కమిషన్ ద్వారా జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్నవారినే ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలీసులు అనుమంతించారు. కౌంటింగ్ కేంద్రం ప్రధాన ద్వారం వద్ద ఏసీపీ నేతృత్వంలో భారీబందోబస్త్‌ను ఏర్పాటు చేసి తనిఖీ నిర్వహించిన తరువాతనే లోపలికి అనుమతించారు. ఖమ్మం కమిషనరేట్‌లో పోలీసులు గత ఆరునెలల నుంచి జరుగుతున్న ఎన్నికల బందోబస్త్‌ను పూర్తిస్థాయిలో విజయవంతం చేసి సీపీ ద్వారా శభాష్ అనిపించుకున్నారు.

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles