జిమ్‌ను ప్రారంభించిన ఎస్పీ

Thu,May 23, 2019 12:39 AM

కొత్తగూడెం క్రైం: జిల్లా కేంద్రంలోని ఓఎస్డీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక వ్యాయామశాలను ఎస్పీ సునీల్‌దత్ బుధవారం ప్రారంభించారు. అత్యాధునిక సాధనాలతో ఏర్పాటు చేసిన ఈ జిమ్ పోలీసులకు ఎంతో ఉపయోగపడనుందన్నారు. నిరంతరం విధి నిర్వహణలో ఉంటూ అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న సిబ్బంది కోసం ఈ జిమ్‌ను అన్ని హంగులతో ఏర్పాటు చేశామన్నారు. మానసికంగా దృఢంగా ఉండాలంటే ముందుగా శారీరకమైన దృఢత్వాన్ని కలిగి ఉండాలన్నారు. ప్రతీ రోజు వీలు దొరికినప్పుడు కొంత సమయాన్ని వ్యాయామం చేయడానికి కేటాయించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఏఆర్ డీఎస్పీ కుమారస్వామి, కొత్తగూడెం డీఎస్పీ ఎస్‌ఎం ఆలీ, ఇల్లెందు డీఎస్పీ ప్రకాశరావు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసరావు, రవి, డీసీఆర్‌బీ సీఐ రాజు, వెల్ఫేర్ ఆర్‌ఐ కామరాజు, అడ్మిన్ ఆర్‌ఐ కృష్ణ, ఎంటీవో సోములు, హోంగార్డ్స్ ఆర్‌ఐ దామోదర్, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ కుమారస్వామి, త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ ఆదినారాయణ, చుంచుపల్లి సీఐ కరుణాకర్, ఆరెస్సైలు గిరిధర్‌రెడ్డి, రమణారెడ్డి, ఎస్సై రవి పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles