గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Thu,May 23, 2019 12:39 AM

కొత్తగూడెం ఎడ్యుకేషన్, మే 22 : మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల (బాలురు) చుంచుపల్లిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐదు గురుకుల పాఠశాలల్లో 2019-20 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్న 5 నూతన గురుకులాలతో కలిపి మొత్తం పది గురుకులాల్లో ఐదవ తరగతికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు వివరించారు. పాఠశాలలో ప్రవేశానికి ఎంపికైన అన్ని ధృవపత్రాలు తీసుకొని ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చుంచుపల్లిలోని గురుకుల పాఠశాలలో రిపోర్టు చేయాలని సూచించారు. సమాచారం కోసం చుంచుపల్లి పాఠశాల:7993456833, మణుగూరు పాఠశాల:7993456834, టేకులపల్లి పాఠశాల:7993456830, అశ్వారావుపేట పాఠశాల:7993456832, భద్రాచలం పాఠశాల:7993456831 సెల్ నంబర్లను సంప్రదించాలని కోరారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles