ఇంట్లోకి దూసుకెళ్లిన టిప్పర్..!

Thu,May 23, 2019 12:39 AM

చండ్రుగొండ, మే 22 : అతివేగంతో వచ్చిన టిప్పర్ రోడ్డు పక్కన గల ఇంట్లోకి దూసుకెళ్లిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలవ్వడంతో పాటు, రెండు ఆటోలు, రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసం అయిన సంఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...జూలూరుపాడు నుంచి చండ్రుగొండ వైపునకు వస్తున్న టిప్పర్ అతివేగంతో బుధవారం తెల్లవారుజామున రావికంపాడు గ్రామానికి చెందిన భూపతి శ్రీనివాసరావు ఇంటి ఎదురుభాగాన్ని ఢీకొని, పక్కనున్న భూపతి చందర్‌రావు ఇంటిని ఢీకొట్టింది. డ్రైవర్ పరారయ్యాడు. చందర్‌రావు కుటుంబ సభ్యులు ఇంటి ఆవరణలో నిద్రిస్తుండటంతో టిప్పర్ ఢీకొట్టడంతో భార్య మాణిక్యమ్మ(48)పై ప్రహరీగోడ, టిప్పర్‌లోని చిప్స్‌రాళ్లు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. టిప్పర్‌ఢీకొట్టిన శబ్దానికి చందర్‌రావుతో పాటు మిగతా కుటుంబ సభ్యులు ఇంట్లోకి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇంటి ఎదురుగా ఉంచిన రెండు ఆటోలు, రెండు ద్విచక్రవాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అదేవిధంగా భూపతి పార్వతికి స్పల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న జూలూరుపాడు సీఐ రాయల వెంకటేశ్వర్లు, అన్నపురెడ్డిపల్లి ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్, చండ్రుగొండ ఏఎస్సై క్రిష్ణారావులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తును చేపట్టి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చందర్‌రావు భార్య మాణిక్యమ్మ మృతి చెందటంతో ఆ కుంబంలో విషాధం నెలకొంది. గ్రామస్తులు కొద్దిసేపు ఆందోళన చేశారు. పోలీసులు గ్రామస్తులకు సర్ది చెప్పడంతో ఆందోళనను విరమించారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles