ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

Thu,May 23, 2019 12:39 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ : ఈనెల 23వ తేదీన జరగనున్న మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓట్లు లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి సిహెచ్. శివలింగయ్య తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశహాల్‌లో పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఓట్లు లెక్కింపునకు 14 రౌండ్లు, 483 సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి సెగ్మెంట్‌కు ఒక కౌంటింగ్ హాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కౌంటింట్ ప్రక్రియ పర్యవేక్షణకు నలుగురు పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించినట్లు చెప్పారు. ఏడు నియోజకవర్గాల పరిధలోని పోలింగ్ కేంద్రాలలో 14,23,351 మంది ఓటర్లున్నారని వీరిలో 9,82,638 మంది, అలాగే 30,942 మంది పీడబ్ల్యూడీ ఓటర్లుండగా 22,899 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చెప్పారు. ముందుగా ఈటీపీబీఎస్ ఓట్లు లెక్కింపు తదుపరి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుందన్నారు. ఈటీపీబీఎస్ ఓట్లు 667, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 214 మొత్తం 881 ఉన్నట్లు చెప్పారు. అదే విధంగా జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియకు దాదాపు 500 మంది పోలీసులకు విధులు కేటాయించినట్లు తెలిపారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles