వైద్య వృత్తిలో వేగుచుక్క డా. సూర్యం

Sun,May 19, 2019 12:46 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వైద్య వృత్తికే వన్నె తెచ్చిన వ్యక్తి డాక్టర్ దాచేపల్లి సూర్యం అని, ఆయన భావితరాలకు ఆదర్శనీయుడని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. శనివారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని డాక్టర్ సూర్యం నివాసంలో ఏర్పాటు చేసిన సంతాప సభకు ఆయన కుటుంబ సమేతంగా హాజరై మాట్లాడారు. వైద్య సౌకర్యాలు సరిగా లేని సమయంలో పిల్లల వైద్యనిపుణులుగా సేవలందించడమే కాకుండా, పలువురికి ఆదర్శంగా నిలిచిన డాక్టర్ సూర్యం మనమధ్య లేకపోవడం బాధాకరమన్నారు. వైద్య వృత్తే కాక సూర్యోదయ పేరుతో విద్యాలయాన్ని ఏర్పాటు చేసి వేలాది మందికి మెరుగైన విద్యనందించారన్నారు. డాక్టర్ సూర్యం కుటుంబంతో 20 ఏళ్ల నుంచి తనకు అనుబంధం ఉందని, తమ కుమారుడు రవీందర్‌రెడ్డి, డాక్టర్ సూర్యం కుమార్తె సునీత కలిసి వైద్యవిద్య అభ్యసించారన్నారు. సూర్యం కుమారుడు డాక్టర్ సునీల్‌తో కూడా తనకు అనుబంధం ఉందని, గతేడాది జూన్‌లో సునీల్ తనకు మోకాలు మార్పిడి చికిత్స చేశారన్నారు.

సూర్యం కుటుంబంతో అనుబంధం ఉంది కాబట్టే తాను కుటుంబ సమేతంగా నివాళులర్పించేందుకు కొత్తగూడెం వచ్చామన్నారు. అనంతరం మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు వనమా రాఘవేందర్‌రావులు మాట్లాడుతూ... కొత్తగూడెం పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్యసేవలు అందించి మంచి పిల్లల వైద్యనిపుణుడిగా సూర్యం మంచిపేరు సంపాదించుకున్నారన్నారు. డాక్టర్ సూర్యం ఆత్మకు శాంతిచేకూరాలన్నారు. అనంతరం కొత్తగూడెం డీఎస్పీ ఎస్‌ఎం ఆలీ పాల్గొని సూర్యం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. టీఆర్‌ఎస్ నాయకులు కంచర్ల చంద్రశేఖర్, బిక్కసాని నాగేశ్వరరావు, డాక్టర్ కంభంపాటి రంగారావు, జె.అబ్రహాం, పల్లపోతు వాసు, తూము వెంకటేశ్వర చౌదరి, లగడపాటి రమేష్, సూర్యం కుమారుడు డాక్టర్ సునీల్, డాక్టర్ సునీత పాల్గొన్నారు.

స్పీకర్‌కు ఘన స్వాగతం
అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి జిల్లా కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు వనమా రాఘవేందర్‌రావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు స్పీకర్‌కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. వారి వెంట జడ్పీటీసీ గిడ్ల పరంజ్యోతిరావు, నాయకులు రజాక్, కాసుల వెంకట్, తూము చౌదరి, బిందు చౌహాన్, బత్తుల వీరయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ హరిలాల్, ఎస్‌కే అన్వర్‌పాషా, పాల్వంచ సొసైటీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, మహిపతి రామలింగం, ఎర్రంశెట్టి ముత్తయ్య, జక్కుల సుందర్, భాగం మహేశ్వరరావు, కూసన వీరభద్రం, కౌన్సిలర్లు కనుకుంట్ల శ్రీను, వై.శ్రీను, ధర్మరాజు, బోడ గణేష్, చందర్, రాజేష్, నగేష్, పాషా, ఆరీఫ్‌ఖాన్, బాలప్రసాద్, మాదా శ్రీరాములు, నాగబాబు, రామ్మూర్తి, శ్రీధర్, ఓంప్రకాష్, రమాకాంత్, శివ, బాలాజీ నాయక్, సురేందర్, కనకరాజు, రాజశేఖర్, రాజుగౌడ్ పాల్గొన్నారు.

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles