ఈ నెలఖరులోగా జీపీఎఫ్ ఆన్‌లైన్

Sun,May 19, 2019 12:43 AM

ఖమ్మం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల జీపీఎఫ్ ఖాతాలను అప్‌డేట్ చేసి నెలాఖరులోగా ఆన్‌లైన్‌లో పెడతామని జిల్లాపరిషత్ సీఈఓ ప్రియాంక హమీనిచ్చారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మోత్కూరి మధు ఆధ్వర్యంలో నాయకులు శనివారం సీఈఓని కలిసి ఉపాధ్యాయులు జీపీఎఫ్ ఖాతాలకు సంబంధించి ఎటువంటి మిస్సింగ్ క్రెడిట్లు లేకుండా అప్‌డేట్ చేయాలని కోరారు. దీనికి సీఈఓ హామీ ఇచ్చారు. సుమారు రూ.8కోట్ల మేరకు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసిన రుణాలు, పార్ట్ ఫైనల్, ఫైనల్ పేమెంట్లకు సంబంధించి ఇప్పటికే ఈ కుబేర్ ద్వారా ఆర్థ్దిక శాఖకు పంపిన వాటిని క్లియర్ చేయించి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసేలా చొరవ తీసుకోవాలని వారు కోరారు. అనారోగ్య కారణాలు, ఇతరత్రా అత్యవసర పనులతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధులకు హాజరుకాలేకపోయిన ఉపాధ్యాయులపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. సమర్థంగా ఎన్నికలు నిర్వహించినందుకు అభినందిస్తూ సీఈఓ ప్రియాంకకు పుష్పగుచ్ఛమిచ్చారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర, జిల్లా బాధ్యులు కె.సైదయ్య, విజయ్ అమృత్‌కుమార్, కట్టా శేఖర్‌రావు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles