పాసింజర్ పునరుద్ధరణకు సంతకాల సేకరణ

Sun,May 19, 2019 12:43 AM

కొత్తగూడెం అర్బన్: సింగరేణి ప్యాసింజర్ రైలు సర్వీసును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం, కొత్తగూడెం యువత సంయుక్తంగా శనివారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించాయి. పుష్‌పుల్ రైలులో ప్రయాణం ఇబ్బందిగా ఉన్నందున దానిని వెంటనే రద్దు చేయాలని కోరారు. ప్రయాణికులు, పట్టణ ప్రజల సంతకాలను సేకరించి సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జీఎంను కలవనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ కొదమసింహం పాండురంగాచార్యులు, కోటా శివశంకర్, జంగా శ్యాంచందర్, శ్రీనివాసరెడ్డి, భూక్యా రమేష్, నవతన్, కూరపాటి రవీందర్, సూర్యప్రకాశరావు, పురుషోత్తం, ఎం.విజయభాస్కర్, ఎం.శరత్, దత్తు, అనుదీప్, విజయ్, భూంపల్లి పూర్ణచందర్, జీవీపీ యాదవ్ పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles