నేడు టీఎస్ ఆర్జేసీ ప్రవేశ పరీక్ష

Sun,May 19, 2019 12:43 AM

ఖమ్మం ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ గురుకుల కళాశాలల్లో(టీఎస్‌ఆర్జేసీ) ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఆదివారం పరీక్ష ఉంటుందని ఉమ్మడి ఖమ్మం జిలా కోఆర్డినేటర్ నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాలు& టెన్త్-2019లో ఉత్తీర్ణలైన విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు అర్హులు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 35 కేంద్రాల్లో పరీక్ష ఉంటుంది. మొత్తం 8454 మంది విద్యార్ధులు హాజరవతారు. ఎంపీసీ గ్రూపునకు 4425 మంది, బైపీసీ గ్రూపునకు 3659 మంది, ఎంఈసీ గ్రూపునకు 370 మంది దరఖాస్తు చేశారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రాష్ట్రంలో బాలికల కళాశాలల సంఖ్య 15, బాలుర కళాశాలలు 20 ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా(బాలికలు), ఏన్కూర్ (బాలికలు), బూర్గంపాడు (బాలికలు) కళాశాలలు ఉన్నాయి.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles