కౌంటింగ్‌లో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి

Fri,May 17, 2019 12:58 AM

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ: ఖమ్మంలో ఈ నెల 23వ తేదీన జరిగే పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌కు నియోజకవర్గ మండలాల నుంచి ఎంపిక చేసిన ఏజెంట్లు తప్పనిసరిగా హాజరు కావాలని టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు తుళ్ళూరి బ్రహ్మయ్య నాయకులకు సూచించారు. కౌంటింగ్‌కు ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, ఇతర ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. మండలం నుంచి ఆరుగురు ఏజెంట్లను ఎంపిక చేసినట్లు చెప్పారు. కౌంటింగ్‌ సమయంలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి వచ్చిన ఓట్లను లెక్కించుకోవటంతో పాటు సంఖ్యను నమోదు చేసుకోవాలని చెప్పారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలపై ఆరా తీశారు. ఓట్ల సరళిని అడిగి తెలుసుకున్నారు. మండలంలోని జడ్పీటీసీతో పాటు 17 ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్‌ కచ్చితంగా గెలుపొందుతుందని బండి పుల్లారావు వివరించారు. అనంతరం కౌంటింగ్‌ ఏజెంట్లకు పాసులు అందజేశారు. వారి వెంట నాయకులు కలపాల శ్రీనివాసరావు, తిప్పనపల్లి శ్రీనివాసరావు, కొనకళ్ళ రమేష్‌, నక్కా చిరంజీవి ఉన్నారు.

103
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles