మట్టి నమూనాల సేకరణ

Fri,May 17, 2019 12:51 AM

సుజాతనగర్‌:మండలంలోని గరీబ్‌పేటలో వ్యవసాయశాఖ అధ్వర్యంలో గురువారం రైతుల వ్యవసాయ భూముల్లో మట్టి నమూనాలు సేకరించినట్లు మండల వ్యవసాయ అధికారిణి జి.నర్మద తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూ ఆరోగ్య కార్డు కార్యక్రమంలో భాగంగా గరీబ్‌పేట గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేశారన్నారు. పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు కలిగిన ప్రతీ రైతు భూమిలో మట్టి నమూనాలను సేకరిస్తామని తెలిపారు. ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ క్రింద 95 మంది రైతుల వద్ద నుంచి మట్టి నమూనాలను సేకరిస్తామని అన్నారు. రైతులు తమ పొలంలోని మట్టి నమూనాలను మండల వ్యవసాయ ఆధికారిణికి అందజేయాలని సూచించారు. సేకరించిన మట్టి నమూనాల్లో నత్రజని, భాస్వరం, పొటాషియం, జింకు వంటి 13 రకాల మూలకాల పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షల ఫలితాలను రైతులకు కార్డు రూపంలో అందిస్తామన్నారు. కార్డులో ఉన్న భూ సారాన్ని బట్టి రైతులు ఏ సీజన్‌లో ఎలాంటి ఎరువులు ఎంత మోతాదులో వాడాలో పొందుపరుస్తామన్నారు. మనిషి హెల్త్‌ కార్డ్‌ మాదిరిగా రైతు వ్యవసాయ క్షేత్రానికి సాయిల్‌ హెల్త్‌ కార్డ్‌ పనిచేస్తుందని అన్నారు. రైతులు ఎప్పటికప్పుడు కార్డుతో వ్యవసాయ అధికారులను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ రాము,రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌ కొమరయ్య, ఏఈవో శరత్‌ పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles