కేటీపీఎస్‌లో ఫైర్‌ యాక్సిడెంట్‌పై అవగాహన

Fri,May 17, 2019 12:51 AM

పాల్వంచ: కేటీపీఎస్‌ 5,6 దశలో పనిచేస్తున్న ఆర్టీజన్లకు ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగినపుడు చేపట్టాల్సి చర్యలపై గురువారం ఫైర్‌ సిబ్బంది అవగాహన కల్పించారు. 5,6 దశల సీఈ ఆధ్వర్యంలో ఆర్టీజన్లకు కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌లో ఫైర్‌ జరిగినపుడు తక్షణమే ఏవిధంగా స్పందించాలనే దానిపై ప్రాక్టికల్‌గా వివరించారు. అంతేకాకుండా సంఘటన జరిగే సమయంలో ఫైర్‌ పంపులను ఏ విధంగా ఓపెన్‌, క్లోజ్‌ చేయాలనే మెలుకువలు వారికి నేర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీజన్లను ఉద్దేశించి సీఈ ఆనందం మాట్లాడుతూ... ఎండాకాలంలో తీవ్రంగా ఎండలు ఉండటం వల్ల కోల్‌ప్లాంట్‌లోని బొగ్గు కుప్పలకు ఆటోమెటిక్‌గా మంటలు వస్తాయని, వాటని సూక్ష్మంగా గమనించి తక్షణమే ఆర్పివేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా కర్మాగారంలో పనిచేస్తున్న ప్రతీ యంత్ర పరికరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయాలని, ఏదైనా అగ్ని ప్రమాదం, మిషనరీలో సౌండ్‌ తేడాలు వచ్చినపుడు సంబంధిత అధికారికి సమాచారం తక్షణమే చేరవేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈలు కృష్ణ, అనిల్‌కుమార్‌, సేప్టీ ఆఫీసర్‌ అన్వర్‌పాషా, శనగా నాగయ్య, శేషసాయి వెల్ఫేర్‌ ఆఫీసర్‌ బాగం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles