యోగా పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన

Fri,May 17, 2019 12:50 AM

రామవరం: రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైన విద్యార్థులను గురువారం కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్‌. నరసింహారావు అభినందించారు. శిక్షణ తీసుకున్న విద్యార్థులు హర్షిత, రేణుక, శ్రీప్రియ, నవత, మురహరి, కౌశిక్‌, కేశవమక్కడ్‌, సంతోష్‌, గణేష్‌, అనుహర్షిత, హారిక, దేవేందర్‌లు హైదరాబాద్‌లో జరిగే యోగా పోటీలలో పాల్గొననున్నట్లు తెలిపారు. రెండు సంవత్సరాలుగా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో రామవరం, గౌతంపూర్‌లలో యోగాలో శిక్షణ ఇస్తున్న యోగా గురువు గుమలాపురం సత్యనారాయణను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం, ఏరియా ఇంజినీర్‌ ఎస్‌.దామోదర్‌, ఏజీఎం(పర్సనల్‌) పి.శ్రీనివాస్‌, డీజీఎం(ఈ అండ్‌ ఎం వర్క్‌షాప్‌) బీడీవీ ప్రసాద్‌, సీనియర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, డీవైఎస్‌ఈ శ్రీనివాస్‌, డీవైపీఎం కిరణ్‌బాబు, అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles