మూతపడిన ఇంగ్లిష్‌ ఉచిత క్లాసులు

Thu,May 16, 2019 12:54 AM

పాల్వంచ, మే 15 : గిరిజన విద్యార్థులకు ఇంగ్లీష్‌లో పరిజ్ఞానం పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఉచిత స్పోకెన్‌ ఇంగ్లీష్‌ వేసవి శిక్షణా శిబిరం మూతపడింది. మొదటి విడత ఏర్పాటు చేసిన ఉచిత స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణా శిబిరం సక్సెస్‌ అయ్యింది. రెండో బ్యాచ్‌ విద్యార్థులు ఆసక్తి చూపకుండా శిబిరం నుంచి ఇండ్లకు వెల్లిపోయారు. వాస్తవానికి ఈ నెల 25వ తేదీ వరకూ నిర్వహించాల్సి ఉండగా ఎండలకు తోడు పదో తరగతి పరీక్ష ఫలితాల వంక పెట్టుకుని అందరు విద్యార్థులు ఇండ్లకు వెళ్లారు. దీంతో వేసవి శిక్షణా శిబిరం కాస్తా మూత పడింది. దీనికి సంబంధించిన వివరాల ప్రకారం.... పాల్వంచ పట్టణంలోని జాతీయరహదారికి పక్కన గల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జిల్లాలోని వివిధ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల కోసం ఐటీడీఏ పీఓ స్పోకెన్‌ ఇంగ్లీష్‌ వేసవి శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మొదటి విడుత వంద మంది విద్యార్థులకు గాను 153మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎండలు ముదురుతుండటంతో ఏప్రిల్‌ చివరి కల్లా 120మంది విద్యార్థులు మిగిలారు. తర్వాత రెండో బ్యాచ్‌కి ఏప్రిల్‌ 26వ తేదీ నంచి కేవలం 10వ తరగతి చదివిన విద్యార్థుల కోసం స్పోకెన్‌ ఇంగ్లీష్‌ క్లాసులు మొదలు పెట్టారు. వాస్తవానికి ఈ బ్యాచ్‌లో వంద మందిని కేటాయిస్తే కేవలం 69మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ తర్వాత ఎండలు బాగా ముదురుతుండటంతో ఇక్కడకు వచ్చిన విద్యార్థులు ఒక్కొక్కరుగా ఇండ్లకు వెల్లిపోవడం మొదలు పెట్టారు. మే5వ తేదీ నుంచి దాదాపుగా అందరు విద్యార్థులు ఇక్కడ నుంచి వెల్లిపోవడంతో స్పోకెన్‌ ఇంగ్లీష్‌ శిక్షణ శిబిరం మూతపడింది. దీనిపై ఈ శిక్షణా శిబిరం ఇన్‌చార్జ్‌, ఆశ్రమ స్కూల్‌ హెచ్‌ఎం నందాను వివరణ కోరగా మొదటి శిబిరం సక్సెగా జరిగిందని, రెండో శిబిరం ఎండలకు తోడు పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయనే సాకుతో విద్యార్థులు ఇండ్లకు పోయారని అన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles