బీటీ-3 పత్తి విత్తనాలు విక్రయిస్తే చర్యలు

Thu,May 16, 2019 12:51 AM

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, మే 15 : ప్రభుత్వం నిషేధించిన బీటీ-3 పత్తివిత్తనాలు విక్రయిస్తే వ్యవసాయశాఖ కఠిన చర్యలు తీసుకోనుంది. ఇందుకు గాను ముందస్తుగా డీలర్లతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. జిల్లాలోని భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట, కొత్తగూడెం వ్యవసాయ డివిజన్ల పరిధిలోని వ్యవసాయశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధంగా డీలర్లక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీటీ-3 పత్తి విత్తనాలతో పాటు ైగ్లెఫల్‌ కలుపుమందును విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించింది. ఈ విత్తనాలు అమ్మితే పీడీయాక్టు కూడా నమోదు చేసేందుకు వెనుకాడేది లేదంటూ వ్యవసాయ అధికారులు జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించి డీలర్లకు దిశ నిర్ధేశం చేస్తున్నారు.

విత్తన డీలర్లు, పురుగుమందుల వ్యాపారులు రిజిష్టర్లు మెయింటిన్‌ చేసి స్టాక్‌ వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత ఏడాది ఎరువులు, విక్రయాల నుంచి బయోమెట్రిక్‌ అమలు చేయడంతో దళారీవ్యవస్థకు చెక్‌ పడింది. దీంతోపాటు పురుగుమందులు, విత్తనాల విక్రయాలు కూడా సక్రమంగా అమ్మేందుకు వ్యవసాయ శాఖ అధికారులు డీలర్లకు తగు సూచనలు చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన డీలర్లు వ్యవసాయ శాఖ సూచించిన విత్తనాలను మాత్రమే విక్రయాలు చేస్తున్నారు. ఇక నుంచి ఎలాంటి నకిలీ విత్తనాలు విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. ఇందుకుగాను వ్యవసాయ శాఖ డివిజన్ల వారీగా విత్తనాల డీలర్లతోసమీక్షలు నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. నకిలీ విత్తనాలు విక్రయించినా, నకిలీ నారు అమ్మినా చట్టపరంగా నేరమని అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. వానాకాలం సీజన్‌కల్లా విత్తన డీలర్లు, వ్యాపారులు రైతులకు అవసరమైన వాటిని అందుబాటులో ఉంచాలని అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో విత్తన, పురుగుమందులు, ఎరువుల డీలర్లతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇల్లెందు నియోజకవర్గంలో డీలర్ల సమావేశం జరగాల్సి ఉంది.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles