రామక్రిష్ణాపురంలో స్వల్ప ఉద్రిక్తత

Wed,May 15, 2019 01:08 AM

-పరిస్థితిని చక్కదిద్దిన పోలీస్‌ ఉన్నతాధికారులు
చింతకాని, మే 14 : ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలో రామక్రిష్ణాపురం గ్రామంలో మంగళవారం పోలింగ్‌ సమయంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక వైద్య సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఉదయం 11గంటల సమయంలో ఇదే గ్రామానికి చెందిన మధిర సాంకేతిక వ్యవసాయాధికారి కాసర అనిల్‌కుమార్‌, తన భార్యతో కలసి పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. భార్య బాలింత కావడంతో మొదట ఓటేసి, అక్కడే ఉన్న వైద్య సిబ్బంది వద్దకు వెళ్లి కూర్చుంది. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్‌ ఏవో భార్యతో ఓటేసిన తర్వాత కేంద్రంలో ఉండడానికి వీళ్లేదు అని చెప్పారు. అక్కడకు చేరుకున్న ఏవో అనిల్‌ ఆమెతో వాదనకుదిగారు. మాటా మాటా పెరిగింది. కానిస్టేబుల్‌ ఏవో అనిల్‌పై చేయి చేసుకుందని స్థానికులు వివరించారు. అక్కడే ఉన్న ఏవో బంధువులు మహిళా కాసిస్టేబుల్‌ను చుట్టుముట్టి దాడికి యత్నించగా అక్కడే ఉన్న వైద్య సిబ్బంది, పోలీసులు మహిళా కానిస్టేబుల్‌ను కాపాడే ప్రయత్నం చేస్తూ, దాడికి యత్నించిన వారిని చెదరగొట్టారు. అనంతరం ఘటన వివరాలు తెలసుకున్న అడిషనల్‌ డీసీపీ దాసరి మురళీధర్‌, ఏసీపీలు దాసరి ప్రసన్నకుమార్‌, సదానిరంజన్‌, సిఐ రమాకాంత్‌, ఎస్‌ఐలు గండికోట మొగిలి, అన్నం కిరణ్‌కుమార్‌ తదితరులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్ది పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగేలా చర్యలు చేపట్టారు. చింతకాని పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆమెపై దాడికి పాల్పడిన పలువురిపై పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారని పోలీసులు తెలిపారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles