స్టేడియాన్ని సందర్శించిన ఐటీడీఏ స్సోర్ట్స్‌ అధికారి

Wed,May 15, 2019 01:08 AM

-కోచ్‌లు, క్రీడాకారులకు అభినందన
మయూరిసెంటర్‌, మే 14: క్రీడలకు నెలవుగా మారిన సర్దార్‌ పటేల్‌ స్టేడియాన్ని పలు క్రీడల అధికారులు తరచూ సందర్శిస్తున్నారు. క్రీడాకారులకు అందుతున్న సౌకర్యాల గురించి, క్రీడాకారుల నైపుణ్యం గురించి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను, వారికి శిక్షన ఇచ్చిన కోచ్‌లను అభినందిస్తున్నారు. ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎన్నికల వ్యవపరిశీలకుడిగా ఇటీవల వచ్చిన స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీ దినకర్‌బాబు తరచూ తెల్లవారుజామునే ఈ స్టేడియానికి వస్తూ క్రీడాంశాలను పరిశీలిస్తూ ఉండేవారు. క్రీడాకారులను ప్రతిభను పరిశీలిస్తూనే కోచ్‌లకు పలు సూచనలు, సలహాలు అందించేవారు. ఇదే క్రమంలో మంగళవారం నాడు భద్రాచలం ఐటీడీఏ స్పోర్ట్స్‌ అధికారి పుట్టా శంకరయ్య సర్దార్‌ పటేల్‌ స్టేడియానికి వచ్చారు. ఆయా మైదానాల్లో తర్ఫీదు పొందుతున్న క్రీడాకారులను పలుకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఐటీడీఏ క్రికెట్‌ క్రీడాకారులు క్రికెట్‌లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి ఎం.పరంధామరెడ్డి, కోచ్‌ మతీన్‌, ఇతర క్రీడల కోచ్‌లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ క్రీడాకారులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles