ఎక్సైజ్‌శాఖ ఉద్యోగుల సంఘం నూతన కమిటీ ఎన్నిక

Mon,May 13, 2019 03:19 AM

మయూరిసెంటర్, మే 12 : టీఎన్‌జీవోస్ ఫంక్షన్ హాలులో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ ఫోరానికి జరిగిన ఎన్నికల్లో నూతన కమిటీని ఆదివారం ఉదయం ఎకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఎన్నికల అధికారిగా వ్యవహరించిన తాళ్ళూరి శ్రీకాంత్ తెలిపారు. అధ్యక్షులుగా ఆర్ సతీష్‌బాబు, వైస్‌ప్రసిడెంట్‌గా ఎన్. కృష్ణారావు, కార్యదర్శిగా బి. విజయ జాయిట్ సెక్రటరీగా ఎం. నిర్మళ, డి. గిరిజశ్రీలు, కోశాధికారిగా ఎం. రాజేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె. రాము, ప్రచార కార్యదర్శిగా ఐ. రామకృష్ణ, ఈసీ మెంబరుగా పీ. అనిల్‌కుమార్‌లను ఎన్నుకోవడం జరిగిందన్నారు. టీఎన్‌జీవోస్ కేంద్ర సంఘం కోశాధికారి రామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఫోరం కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ జిల్లాలో టీఎన్‌జీవోస్ సంఘం చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షులు పొట్టపింజర రామయ్య మాట్లాడుతూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఫోరం సభ్యులకు అభినందనలు తెలుపుతూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేసుకోవాలన్నారు. టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షులు పొట్టపింజర రామయ్య మాట్లాడుతూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఫోరం సభ్యులకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. కార్యక్రమంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గంగవరపు బాలకృష్ణ, కేంద్ర సంఘం కార్యదర్శి బి వెంకటేశ్వరరావు, కొనిదన శ్రీనివాసరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ కె దుర్గాప్రసాద్, జిల్లా కోశాధికారి వల్లోజి శ్రీనివాసరావు, రమణయాదవ్, గుంటుపల్లి శ్రీనివాసరావు, సతీష్, రాజశేఖర్, ప్రదీప్ తదితరులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles