స్థూలకాయుడు నవీన్ గౌడ్ మృతి

Mon,May 13, 2019 03:18 AM

-పాల్వంచ, మే12: ఒకవైపు స్థూలకాయం (ఒబేసిటీ), మరో
వైపు గుండె జబ్బుతో బాదపడుతున్న పాల్వంచ పట్టణానికి చెందిన కారు డ్రైవర్ బూడిద నవీన్ గౌడ్(33), ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఆయనను కుటుంబీకులు ఇటీవల ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యానికి రూ.40లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఈ విషయాన్ని ఈ నెల 4న టీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చారుగుండ్ల రమేష్ సమాచారమిచ్చారు. దీనికి కేటీఆర్ వెంటనే స్పందించారు. వెంటనే హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి రావాల్సిందిగా నవీన్ గౌడ్‌కు సమాచారమిచ్చారు. నవీన్ గౌడ్ కుటుంబీకులతో కేటీఆర్ పీఆర్వో కూడా మాట్లాడారు. హైదరాబాద్ నిమ్స్‌కు కాకుండా విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో నవీన్ గౌడ్‌ను కుటుంబీకులు చేర్పించారు. ఆయన అక్కడే ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతదేహాన్ని టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, టీఆర్వీకేఎస్ రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చారుగుండ్ల రమేష్, నాయకులు తోట కోటేశ్వరరావు, పెద్దపాక సత్యం, కాల్వ రవికుమార్, ధర్మపురి నాగేశ్వరరావు, మేదర రమేష్, డీవీఆర్, శేషంరాజు, నాగేశ్వరరావు, 1535 నాయకుడు కుక్కల సాంబయ్య తదితరులు సందర్శించి నివాళులర్పించారు. ఆ కుటుంబానికి సంతాపం, సానుభూతి తెలిపారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles