తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు రాంబాయమ్మ మృతి

Mon,May 13, 2019 03:17 AM

తిరుమలాయపాలెం, మే, 12: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర మాజీ కార్యదర్శి దివంగత రాయల రవన్న మాతృమూర్తి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు రాయల రాంబాయమ్మ(95) శనివారం రాత్రి మండలంలోని పిండిప్రోలులో మృతిచెందారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. కుమారులు రాయల రవన్న, రాయల అప్పయ్య మృతిచెందారు. మరో ఇద్దరు కుమారుల్లో రాయల చంద్రశేఖర్, పార్టీ రాష్ట్ర నాయకుడిగా ఉన్నారు. రాయల నాగేశ్వరావు, పిండిప్రోలు సర్పంచ్‌గా.. పార్టీ డివిజన్ నాయడిగా ఉన్నారు. భౌతికకాయాన్ని న్యూడెమోక్రసీ నాయకులు గాదే దివాకర్, రాయల చంద్రశేఖర్, రాయల రమ, గోకినపల్లి వెంకటటేశ్వరావు, సీవై పుల్లయ్య, గుర్రం అచ్చయ్య, ఎం.రాజేంద్ర ప్రసాద్, సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, నున్నా నాగేశ్వరావు, దొండేటి ఆనందరావు, పిండిప్రోలు ఎంపీటీసీ సభ్యుడు చామకూరి సురేందర్‌నాథ్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం, సంతాప సభ జరిగింది. నాయకులు మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమ నాయకులను సమాజానికి అందించిన రాయల రాంబాయమ్మ గొప్ప మాతృమూర్తి అని కొనియాడారు. ఆమె భౌతిక కాయాన్ని దహనం చేయకుండా, వైద్య విద్యార్థుల ప్రయోజనార్థం ఖమ్మం మమతా ఆసుపత్రి ల్యాబ్‌కు కుటుంబ సభ్యులు అప్పగించారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles