కారుకొండలో జోరుగా ఎంపీటీసీ అభ్యర్థి ప్రచారం

Sun,May 12, 2019 12:24 AM

లక్ష్మీదేవిపల్లి: టీఆర్‌ఎస్ బలపరుస్తున్న ఎంపీటీసీ అభ్యర్థి బానోత్ వశ్యానాయక్ కారుకొండలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. శనివారం మండల పరిధిలోని కారుకొండ పంచాయతీలోని భట్టుతండా, కారుకొండ, తెలగరామవరం, గడ్డిగుట్ట గ్రామాల్లో బానోత్ వశ్యా నాయక్ ప్రచారం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ తనను గెలిపించాలని కోరుతూ నమూనా బ్యాలెట్ పత్రాలను అందజేస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా గ్రామాభివృద్ధికి బాటలు వేయనునున్నట్లు తెలిపారు. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం ఉందని, తన హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాల్లో చేయడం జరిగిందన్నారు. మరోసారి ఎంపీటీసీగా అవకాశం ఇవ్వాలని, ఎల్లప్పుడూ గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలకై శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నా, నర్సింహం, వెంకన్న, వెంగళరావు, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, రాములు, యూసుఫ్, దేవేందర్, రమేష్, శ్రీను, జైపాల్, జానీ, లక్ష్మీనారాయణ, రవి, బోనియా, వెంకటేష్, మంగ్యా, సురేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles